గ్రామాల అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Nov 22 , 2025 | 01:20 AM
గ్రా మాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. శుక్రవారం కడియపులంక, జేగురుపాడు పాములమెట్ట ప్రాంతా ల్లో ఆయన పర్యటించారు. ముం దుగా పల్లాలమ్మ తల్లి దర్శించుకుని పూజలు చేశారు.
ఎమ్మెల్యే గోరంట్ల
కడియం, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రా మాల అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. శుక్రవారం కడియపులంక, జేగురుపాడు పాములమెట్ట ప్రాంతా ల్లో ఆయన పర్యటించారు. ముం దుగా పల్లాలమ్మ తల్లి దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం కడియపులంకలో పంచాయ తీ నిధులతో నిర్మించే పలు రోడ్ల కు శంకుస్థాపన చేశారు.సర్పంచ్ మారిశెట్టి పద్మావతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడు తూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలు, ప్రభు త్వ భవనాలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. అలాగే పాములమెట్టలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ పాములమెట్ట ప్రాంతంలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చేందుకు ప్రతిపాదనలు జరిగాయన్నారు. చై తన్యనగర్ ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మించి అటు చైతన్యనగర్, ఇటు పాములమెట్ట ప్రాంతానికి ఇ బ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నా రు. ఇప్పటికే నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని, రాబోయే పుష్కరాల నాటికి నూరుశాతం పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీ వెలుగుబంటి ప్ర సాద్, ఏపీఐఐసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, అన్నందేవుల చంటి, వెలుగుబంటి నాని, గట్టి నర్సయ్య, పాతూరి రాజేష్, పాటంశెట్టి రాం జీ, మార్గాని ఏడుకొండలు, బోడపాటి గోపి, గట్టి సుబ్బారావు, ప్రత్తిపాటి రామారావుచౌదరి, చెల్లుబోయిన శ్రీను, ముద్రగడ జమీ, నాగిరె డ్డి రామకృష్ణ పలువురు అధికారులు పాల్గొన్నారు.