‘బడి’తెగింపు!
ABN , Publish Date - Jun 20 , 2025 | 01:10 AM
విద్యా హక్కుచట్టం అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాల్సి ఉండగా.. కొంతమంది ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు.
సుప్రీం చెప్పినా పేదలకు పాట్లే
ఆర్టీఈ ప్రవేశాలకు ముప్పుతిప్పలు
పట్టని ప్రైవేటు యాజమాన్యాలు
ఉమ్మడి జిల్లాలో సీట్లు 4,045
పలు దరఖాస్తుల తిరస్కరణ
మిగిలిన సీట్లు 1,268
తల్లిదండ్రుల ఆవేదన
చోద్యం చూస్తున్న విద్యాశాఖ
విద్యా హక్కుచట్టం అమలులో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లల్లో ఈ చట్టం కచ్చితంగా అమలు చేయాల్సి ఉండగా.. కొంతమంది ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. స్కూళ్లు తెరిచి సుమారు పది రోజులు కావొస్తున్నా.. ఈ చట్టం ద్వారా ఎంత మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించారనే విషయంపై స్పష్టత లేదు. ఈ విషయం కోర్టులో ఉందని జిల్లా సర్వశిక్ష అభియాన్ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఒకటో తరగతిలో జాయిన్ చేసుకున్న ఓ ప్రముఖ కిడ్స్ పాఠశాల.. ఈ ఏడాది మాత్రం ఏకంగా తమ స్కూల్‌లో ఒకట్రెండు తరగతులు నిలిపివేశా మని సెలవిచ్చింది. దీనిని సంబంధిత మండల విద్యా ధికారి కూడా నిర్ధారించేశారు. దీనివల్ల ఆన్‌లైన్‌లో కేటాయింపు జరిగిన 18 మంది పిల్లల అడ్మిషన్లు అయోమయంలో పడ్డాయి. కొద్దిరోజుల్లోనే మళ్లీ ఆ పిల్లలను చేర్పించుకోవడం గమనార్హం. ఈ ఒక్క ఉదా హరణ చాలు పేదల సీట్లు ఎగ్గొట్టడానికి యాజమా న్యాలు ఎలాంటి ఎత్తులు వేస్తున్నాయో చెబుతుంది.
(రాజమహేంద్రవరం/కాకినాడ/
అమలాపురం - ఆంధ్రజ్యోతి)
విద్యాహక్కు చట్టాన్ని.. సుప్రీం కోర్టు నిర్దేశాలను పలు ప్రైవేటు/కార్పొరేటు పాఠశాలలు లెక్కచేయడం లేదు.ఎలాగైనా ప్రవేశం కల్పించాలనే ఉద్దేశం కొస రంత కూడా కానరావడం లేదు. ఏదోలా సీటు ఎగ్గొడ దామనే దురుద్దేశం కొండంత కనిపిస్తోంది. తల్లిదండ్రు లను ముప్పుతిప్పలు పెట్టి తూతూ మంత్రంగా ప్రవే శాలు కల్పిస్తున్నారు. చట్టాన్ని కొన్ని పాఠశాలలు ప్రతి ఏడాదీ పెద్దగా పట్టించుకోకపోయినా ‘యాక్షన్’ ఉండ డం లేదు. విద్యార్థుల నుంచి ఏదో ఒక రూపేణా సొ మ్ములు లాగేస్తున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. దీంతో పేద తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎగ్గొట్టడానికి ఎత్తులు
విద్యాహక్కు చట్ట ప్రకారం పేదలకు సీట్లు కల్పిం చడానికి ప్రతి ఏడాదీ వెబ్‌సైటులో విద్యార్థులు దర ఖాస్తు చేసుకోవాలి. ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈ ఏడాది మే 27 నుంచి జూన్ 9 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అడ్మిషన్లకు సంబంధించి ఆన్‌లైన్‌లో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకున్నారు. రెండో దశ, మూడో దశ కూడా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఆరు దశల వడపోత తర్వాత పాఠశాలను కేటాయిస్తారు. ఇలా కేటాయించిన తర్వా త సదరు స్కూల్‌కి విద్యార్థిని తీసుకొని తల్లిదండ్రులు వెళ్లి సీటు నిర్ధారణ చేసుకోవాలి. ఈ దశలోనే విద్యా ర్థుల తల్లిదండ్రులకు నరకం చూపిస్తున్నారు. కాస్త గట్టిగా నిలదీస్తే పని జరుగుతోంది. లేదంటే అంతే. ఆర్టీఈ ప్రకారం అడ్మిషన్లను సమగ్ర శిక్షా (ఎస్‌ఏ/ ఎస్‌ఎస్‌ఏ) చూసుకుంటోంది. సదరు అధికారులను స్కూలు యాజమాన్యాలు బురిడీ కొట్టిస్తున్నాయి.
సుప్రీం ఆదేశాలు బేఖాతర్..
విద్యా హక్కు చట్టం ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాహక్కు చట్ట ప్రకారం ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సామర్థ్యా నికి అనుగుణంగా ప్రభుత్వమే ఆన్‌లైన్ ద్వారా సీట్లు కేటాయిస్తుంది. దీనిని ఉల్లంఘిస్తే సుప్రీం కోర్టు ఆదేశా లను లెక్కచేయనట్టే. దీనిపై తీవ్రమైన చర్యలు తీసు కొనే అవకాశం ఉంటుంది. స్కూల్ అనుమతులను రద్దు చేయడం జరుగుతుంది. అయితే పేదల సీట్ల విషయంలో అధికారులు ప్రైవేటు/ కార్పొరేటు స్కూళ్ల ను బతిమలాడుకోవాల్సి వస్తోంది. సుప్రీం కోర్టు ఆదే శాలున్నా కనీసం పట్టించుకోవడంలేదు. మాకేంటి అనేలా వారి తీరు ఉంది. పాఠశాలల యాజమాన్యాలు రకర కాల కారణాలు చూపుతూ విద్యాశాఖకు లేఖలు సమర్పించి సీట్లను ఎగ్గొట్టే పనిలో పడ్డాయి.
ఉచితమన్నా..భర్తీ కాని సీట్లు 1268
తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 1418, కాకినాడ జిల్లాలో 1812, కోనసీమ జిల్లాలో 815 సీట్లు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిపి మొత్తంగా 4,045 సీట్లు కేటా యించారు. తల్లిదండ్రుల వేడుకోలు, అధికారుల బుజ్జ గింతల అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో 1380 మందికి, కాకినాడ జిల్లాలో 754 మంది, కోనసీమ జిల్లా లో 643 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మొత్తంగా 1,268 సీట్లు భర్తీకాలేదు. ఉచితమన్నా భర్తీ కాకపో వడం గమనార్హం. దీనిపై అధికారులు ఆలోచించాలి.
వివరాలు గోప్యం?
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు తప్పని సరిగా విద్యాహక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం అడ్మిషన్లు ఇవ్వాలి. ఆర్టీఈ ద్వారా కొన్నేళ్లుగా ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ చేపడుతున్నా.. వాటి వివరాలను మాత్రం గోప్యంగా ఉంచుతోంది. ఏటా అడ్మిషన్ల సమయంలో హడావుడి చేసే విద్యాశాఖ అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత జిల్లాల వారీగా ఏయే పాఠశాలలో ఎన్ని అడ్మిషన్లు కల్పించారనే వివరాలను మాత్రం వెల్లడించడం లేదు. ఇప్పటి వరకు ఆర్టీఈ ద్వారా కల్పించిన వివరాలు కూడా విద్యాశాఖ బయటపెట్టలేదు. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల ఒత్తిడితోనే వివరాలు బయటపెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఉచితమని.. లాగేస్తున్నారు?
చట్ట ప్రకారం ఒకటో తరగతిలో ఉచితంగా ప్రవేశం కల్పిస్తే పదో తరగతి వరకూ ఆ వెసులుబాటు ఉం టుంది. ఇవాళ ప్రైవేటు/ కార్పొరేటు పాఠశాలల్లో చూస్తే ఒకటో తరగతికి రూ.లక్ష లాగేస్తున్నారు. వాస్త వంగా లెక్కలు వేస్తే పాక్షిక ఉచితమనే విషయం బోధపడుతుంది. బస్సు, పుస్తకాలు, యూనిఫాం, షూ, టై, బెల్టు, బిల్డింగ్ ఫండ్, స్పెషల్ ఫీజు, ఐఐటీ, నీట్ ఇలా రకరకాల బాదుడు మామూలే. ఈ డబ్బులు ఆయా తల్లిదండ్రులు చెల్లించాల్సిందే. కేవలం ట్యూషన్ ఫీజులో మాత్రమే ఉచితం కాదుగానీ రాయితీ ఇస్తు న్నారు. అయినప్పటికీ ఆర్టీఈ ప్రకారం అడ్మిషన్లు అన గానే యాజమాన్యాలు ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కఠిన చర్యలు తీసుకొనే అవకాశం విద్యా శాఖ అధికారులకు ఉన్నా ఆ అధికారాన్ని కాగితంపై పెట్టకపోవడంపై ఆరోపణలు వినవస్తున్నాయి.