నేడు, రేపు ‘నన్నయ’లో జాతీయ కార్యశాల
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:14 AM
దివాన్‌చెవురు, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో సోమ, మంగళవారాల్లో భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అనే అంశంపై జాతీయ కార్యశాలను నిర్వహిస్తున్నట్టు వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఆదివారం విలేకర్లతో వీసీ మాట్లాడుతూ భారతీయ భాషా సమితి, న్యూఢిల్లీలోని విద్యామంత్రిత్వశాఖ సహకారంతో ఈ కార్యశాలను నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ముఖ్యఅతిథిగా
హాజరుకానున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
దివాన్‌చెవురు, డిసెంబరు7 (ఆంధ్రజ్యోతి): ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో సోమ, మంగళవారాల్లో భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలం అనే అంశంపై జాతీయ కార్యశాలను నిర్వహిస్తున్నట్టు వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఆదివారం విలేకర్లతో వీసీ మాట్లాడుతూ భారతీయ భాషా సమితి, న్యూఢిల్లీలోని విద్యామంత్రిత్వశాఖ సహకారంతో ఈ కార్యశాలను నిర్వహిస్తున్నామన్నారు. సోమవారం ముఖ్యఅతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై జాతీయ కార్యశాలను ప్రారంభిస్తారని చెప్పారు. ఆత్మీయ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షుడు ఆర్‌డి.విల్సన్, భారతీయ భాషా సమితి సీనియర్ ఎక్స్‌పర్ట్ ఆచార్య ఆర్‌ఎస్.సర్రాజు, తానా సాహితీ వేదిక అధ్యక్షుడు తోటకూర ప్రసాద్, భారతీయ భాషాసమితి అకడమిక్ కోఆర్డినేటర్ కె.గిరిధరరావు దేశ నలుమూలల నుంచి తెలుగు, సంస్కృత భాషల ప్రముఖులు హాజరవుతారని తెలిపారు. భారతీయ భాషల్లో ఏకరూప శాస్త్రీయ సాంకేతిక పదజాలంపై మరింత అవగాహన పెంచుకునేందుకు విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీకళాశాలల తెలుగు, హిందీ, సంస్కృతం అధ్యాపకులు, పాఠ్యపుస్తకాలు రచించిన విద్యావేత్తలు, భాషాభిమానులు ఈ సదస్సుకు హాజరై విజయవంతం చేయాలని సూచించారు. కార్యశాల కోఆర్డినేటర్‌గా తలారివాసు, కార్యనిర్వాహక కమిటీ సభ్యులుగా కె.వరప్రసాద్, పి.రాజశేఖర్, ఎన్.నారాయణ, ఎం.రమేష్, ఆనంద్ వ్యవహరిస్తారని తెలిపారు.