Share News

విజిట్రబుల్స్‌!

ABN , Publish Date - Nov 11 , 2025 | 12:49 AM

కార్తీకమాసం ఎఫెక్ట్‌ కూరగా యల ధరలపై పడింది.. ఒక్కసారిగా ఆకాశా న్నంటాయి. ఏ రకం చూసినా కిలో రూ.50లకు తక్కువ లేదు.

విజిట్రబుల్స్‌!

కూరగాయలకు కార్తీకం ఎఫెక్ట్‌

భారీగా పెరిగిన ధరలు

ఏ రకమైనా కిలో రూ.50పైనే

కిలో వంకాయ రూ.100

బహిరంగ మార్కెట్‌లో దోపిడీ

కొనుగోలుదారులు లబోదిబో

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) : కార్తీకమాసం ఎఫెక్ట్‌ కూరగా యల ధరలపై పడింది.. ఒక్కసారిగా ఆకాశా న్నంటాయి. ఏ రకం చూసినా కిలో రూ.50లకు తక్కువ లేదు. అన్ని కూరగాయల ధరలు రూ.50ల పైనే పలుకుతున్నాయి. రైతు బజా ర్‌లో బెండకాయలు, దొండకాయలు, బీరకా య లు కిలో రూ.50ల చొప్పున విక్రయిస్తున్నారు. నల్ల వంకాయలు రూ.80ల వరకూ విక్రయి స్తున్నారు. తెల్లవంకాయలు కాస్త ధర తక్కు వగా ఉన్నాయి. దీంతో రైతు బజార్‌కు వచ్చిన జనం ధరలు చూసి బేజారవుతున్నారు. సామాన్యులే కాదు మధ్యతరగతి వర్గాలు సైతం బెంబెలెత్తిపోతున్నారు. ఒకటికి రెండు సార్లు ధరలు తెలుసుకుంటున్నారు. బహిరంగ మార్కె ట్లో కిలో వంకాయలు రూ.100పైనే పలుకుతుంటే ఇతర కూరగాయలు సైతం కిలో రూ.80 నుంచి రూ.100ల వరకూ విక్రయిస్తున్నారు. కనీసం పావుకిలో కొందామన్నా ఏ కూరగాయ కూడా రూ.25లకు తక్కువకు రావడంలేదు. ఈ ధరలు చూసి ప్రజలకు నోటమాట రావడంలేదు. బహిరంగ మార్కెట్లతో పోల్చితే రైతు బజార్లలో ధరలు కాస్త తక్కువగానే ఉన్నా కూరగాయల నాణ్యతపై ప్రజలు పెదవి విరుస్తున్నారు.సచ్చులు, పుచ్చులు తప్ప అక్క డేమీ ఉండడంలేదనే విమర్శలు వస్తున్నాయి. కార్తీకమాసానికి తోడు ఇటీవలి మొంథా తుఫా న్‌ దెబ్బ కూరగాయల ధరలపై పెను ప్రభావం చూపుతోందనే చెప్పాలి. ఆకుకూరల పరిస్థితి దారుణంగా ఉంది. మొంథా తుఫాన్‌ దెబ్బకు పాదు కూరలన్నీ తుడుచుపెట్టుకుని పోవడం, ఇతర కూరగాయల మొక్కల పువ్వు, పిందె రాలిపోవడం ధరలు భారీగా పెరుగుదలకు ప్రధాన కారణంగా రైతులు చెబుతున్నారు.

బహిరంగ దోపిడీ

రిటైల్‌ మార్కెట్లలో ధరలు ఇష్టారాజ్యంగా ఉన్నాయి. సెమీ హోల్‌సేల్‌ మార్కెట్లలో కిలో వంకాయల ధర రూ.100లు ఉంటే రిటైల్‌ మార్కెట్లలో పావు కిలో రూ.30లకు విక్రయిస్తున్నారు. అంటే కిలో రూ.120. బీరకాయలు, బెండకాయలు, దొండకాయల ధరలు అనూహ్యంగా పెరిగి కిలో రూ.80పైనే ఉన్నాయి. టమాటా కిలో రూ.40 ధర ఉన్నా నాణ్యత ఉండడంలేదు. అరటికాయల ధర పెరిగిపోయింది. మీడి యం సైజులో ఉండే రెండు కాయలు రూ.25లు చెబుతున్నారు. రైతు బజార్లలో కూరగాయల నాణ్యత ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ధర తక్కువైనా నాణ్యత లేకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

మరో నెల ఇంతేగా..

బీర, బెండ, దొండ, ఆనబ వంటి పాదు కూరలు, టమోటా, ఇతర కూరగాయల పం టలు మొన్నటి మొంథా తుఫాన్‌ దెబ్బకు తుడిచిపెట్టుకుపోవడంతో సీతానగరం, కడియం మండలాల్లో కూరగాయలు సాగు చేసే రైతులు ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్తగా నార్లు పోస్తున్నారు. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలించి ఇవన్నీ కాపునకు వచ్చేసరికి ఎంతలేదన్నా నెలరోజులు పైనే పడుతుందని చెబుతున్నారు. తాళ్లపూడి మండలం పెద్దేవంలో ఆకు కూరలసాగు పెద్దఎత్తున జరుగుతుంది. తుఫాన్‌ వర్షాల దెబ్బతో ఒక్క గోం గూర మినహా ఇతర అన్ని ఆకుకూరలు, కొత్తిమీర, పుదీనా పూర్తిగా ధ్వంసమైంది. లోకల్‌ టమోటా నారు కుళ్లిపోయింది. రైతులు మళ్లీ నారు పోస్తున్నారు. నిజానికి నవంబరు నుంచి లోకల్‌ టమోటా మార్కెట్లోకి రావాల్సి ఉంది. ఇది కూడా ఆలస్యం కానుంది. లోకల్‌గా కూరగాయల దిగబడులు లేకపోవడం,రావులపాలెం, మడికి చుట్టుపక్కల గ్రామాల్లో పండించే సరు కు ఒక్కటే ఇక్కడి అన్ని మార్కెట్లకు రావడంతో డిమాండ్‌ పెరిగి ధరలు తారస్థాయికి చేరుతున్నాయి.మరో నెలరోజులు కూరగాయాలు తప్పే లా లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 11 , 2025 | 12:49 AM