Share News

కూరలు కారంగా...

ABN , Publish Date - Nov 14 , 2025 | 02:27 AM

కార్తీక మాసం అంటేనే వ్రతాలు, నోములు, వనభోజనా లు.. దీంతో అధిక శాతం మంది శాఖాహారంపైనే ఆధారపడంతోపాటు అధిక వర్షాలు, వరస తుఫా న్‌ల కారణంగా దిగుబడులు తగ్గి ధరలు ఆకాశానంటుతున్నాయి.

కూరలు కారంగా...

ఆలమూరు, నవంబరు13(ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం అంటేనే వ్రతాలు, నోములు, వనభోజనా లు.. దీంతో అధిక శాతం మంది శాఖాహారంపైనే ఆధారపడంతోపాటు అధిక వర్షాలు, వరస తుఫా న్‌ల కారణంగా దిగుబడులు తగ్గి ధరలు ఆకాశానంటుతున్నాయి. ఈ ఏడాది తరచు తుఫాన్‌లు రావడంతోపాటు అధిక వర్షాలకు లంక భూముల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మెట్ట ప్రాంతాల్లో సాగుపైనే ప్రస్తుతం ఆధారపడి ఉంది. ఆలమూరు మండలం మడికి అంతర్‌ రాష్ట్ర కూరగాయల మార్కెట్‌కు అధికంగా లంక భూముల నుంచి కూరగాయలు వస్తుంటాయి. ఈసారి లంక తోటలు దెబ్బతినడంతో కార్తీకమాసంలో పూర్తిగా మెట్ట సాగుపైనే మార్కెట్‌ నడుస్తోంది. కూరగాయలకు మంచి డిమాండ్‌ ఉండ డంతో మెట్ట నుంచి తీసుకొస్తున్న రైతుల పంట పండింది. సాధారణంగా రెండు మూడు కూరగాయలు దిగుబడులు తగ్గితే వాటి ధరలు పెరిగేవి. ఈసారి అలాకాకుండా అన్ని రకాల కూరగాయ లు మార్కెట్‌లో కిలో రూ.వందపైనే పలుకుతున్నాయి. కూరగాయల తోటలు తుఫాన్‌కు భారీగా దెబ్బతినడంతో దిగుబడులు లేక కూరగాయల ధరలు అమాంతరంగా పెరిగిపోయాయి. మడికి అంతర్‌రాష్ట్ర కూరగాయల మార్కెట్‌కు మూడు రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవు తాయి. అలాగే ఇక్కడ నుంచి పలు ప్రాంతాలకు ఎగుమతులు జరుగుతాయి. అన్ని ప్రాం తాల్లో ఒకేసారి కూరగాయల పంటలు దెబ్బతినడంతో ఇక్కడకు దిగుమతులు తగ్గిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లో టమాటో, బంగాళాదుంప రేట్లు కాస్త అందు బాటులో ఉన్నాయి. మరో 20 రోజుల తర్వాత కొత్త పంటలు దిగుబడులకు వచ్చి ధరలు తగ్గే అవకాశం ఉందని హోల్‌సేల్‌ వ్యాపారి చెల్లుబోయిన సింహచలం తెలిపారు.

వంకాయలు రూ.650-800

బెండ రూ.550

దొండ రూ.600

చిక్కుళ్లు రూ.1000

కాకర రూ.500

పచ్చిమిర్చి (లావు) రూ.600

పచ్చిమిర్చి (సన్నాలు) రూ.250

బంగాళాదుంప రూ.250

కంద రూ.300

టమోటో రూ.250

ఆనభకాయ ఒకటి రూ.30

Updated Date - Nov 14 , 2025 | 02:28 AM