ప్రైవేటుకు ఫిట్‌నెస్!
ABN , Publish Date - Mar 18 , 2025 | 12:40 AM
ఇక వాహనాల ఫిట్‌నెస్‌కు ఆర్‌టీవో అధికా రుల చుట్టూ తిరగాల్సిన పనేలేదు.. ఎందుకంటే వాహనాల ఫిట్‌నెస్ బాధ్యతను ప్రైవేట్‌కు అప్ప గించారు. కేంద్ర రవాణా శాఖ ఆదేశాలతో జిల్లా కు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను శాంక్షన్ చేసింది.
3 జిల్లాలు 3 కేంద్రాలు
తూర్పునకు రాజానగరం
కాకినాడకు వాకలపూడి
నెలాఖరుకు కోనసీమలో
ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇక ప్రైవేటు
ఆర్టీఏ కార్యాలయాలకు దూరం
ఏ జిల్లా వాహనాలు అక్కడే
రోజుకు 50 వాహనాల టెస్ట్‌లు
సర్కారు ఆదాయానికి గండి
రెండేళ్ల వరకూ ప్రైవేటు జేబు ఫుల్
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
ఇక వాహనాల ఫిట్‌నెస్‌కు ఆర్‌టీవో అధికా రుల చుట్టూ తిరగాల్సిన పనేలేదు.. ఎందుకంటే వాహనాల ఫిట్‌నెస్ బాధ్యతను ప్రైవేట్‌కు అప్ప గించారు. కేంద్ర రవాణా శాఖ ఆదేశాలతో జిల్లా కు ఒక ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)ను శాంక్షన్ చేసింది. రాజమ హేంద్రవరం, కాకినాడ, విజయనగరం, అనకా పల్లి జిల్లాలకు సంబంధించి సీటీఆర్‌ఎల్ ఆల్ట్ ఫిక్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టెండరు దక్కింది.ఆ సంస్థ ఐదు జిల్లాల్లో శుక్రవారం నుంచి వీటిని ప్రారంభించారు. ఈ నెల 31వ తేదీలోపు అన్ని జిల్లాల్లో ఈ స్టేషన్లు పనిచే యనున్నాయి.ఆయా జిల్లాల్లో ప్రజలకు సంబం ధించిన లైట్ మోటారు వెహికిల్స్, హెవీ మో టార్ వెహికిల్స్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఈ సంస్థ మాత్రమే ఇస్తుంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజానగరం, కాకినాడ జిల్లాకు సంబంధించి వాకలపూడిలో ఏర్పాటు చేశారు. ఇక కోనసీమ జిల్లాలో ఈ నెలాఖరుకు ఏర్పాటు చేయనున్నారు.ఇంత వరకూ ఆర్టీఏ కార్యాల యంలో ఫిట్‌నెస్ సర్టిఫై చేసేవారు. ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుంటే ఆయా వాహనాలకు ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం చలానా కట్టించుకుని ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇచ్చేవారు. ఈ పనులన్నీ ఇక ఈఎటీఎస్‌లో జరుగుతాయి.
ప్రైవేటీకరణ ఎందుకు?
ఫిట్‌నెస్ సర్టిఫై ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎందువల్ల రవాణా శాఖ నుంచి ఈ విధులను తప్పించారనే దానికి సమా ధానం లేదు. ఆర్టీఏ అధికారులకు ఏ విధమైన సమాచారం లేదని చెప్పడం గమనార్హం. అవి నీతి తగ్గించాలని ప్రైవేటీకరించారా..లేదా ఎక్కు వ ఆదాయం కోసం అమలు చేస్తున్నారా, ఫిట్ నెస్‌లో లోపాలు ఏమైనా బాగుపడతాయని చూ స్తున్నారా అనేది తెలియడంలేదు. వాహనాలు ఫిట్‌నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. నిజాయితీగా ఈ టెస్ట్‌లు నిర్వహిస్తే మేలే. ప్రైవేట్ బస్సులు, కార్లు, క్యాబ్‌లు, ట్రాక్టర్లు, లారీలు, గూడ్స్ వాహ నాలు, ట్యాంకర్లు, స్కూల్ బస్సులు వంటివన్నీ ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాలి. పసుపు నెం బరు బోర్డులు ఉంటే ట్రాన్స్‌పోర్టు, తెలుసు నెం బరు ప్లేట్లు ఉంటే నాన్- ట్రాన్స్‌పోర్టు వాహ నాలుగా పరిగణిస్తారు. కొత్త వాహనానికి లైఫ్‌టైమ్‌లో మొదటి 8 ఏళ్లలో ప్రతి రెండేళ్లకో సారి ఫిట్‌నెస్ టెస్ట్ చేయించాలి. 8 ఏళ్ల తర్వాత ఏడాదికోసారి టెస్ట్ చేయించాలి. 15 ఏళ్లకు కండిషన్ చూసి ఆపేయాలి. స్కూల్ బస్సులకు కేవలం 15 ఏళ్ల వరకే ఫిట్‌నెస్ చూస్తారు. త ర్వాత వాటిని స్కూల్ బస్సుల కింద వాడకూడ దు.గతంలో జిల్లాలో వాహనాల ఫిట్‌నెస్ రాజ మహేంద్రవరం,కొవ్వూరు ఆర్టీవో కార్యాలయా ల్లో నిర్వహించేవారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని వాహనాలు రాజానగరం కల్వచర్ల ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్‌నెస్ టెస్టింగ్ స్టేషన్(ఏటీఎస్)కు రావాల్సిందే.
అవినీతిని కొనసాగిస్తారా..?
గతంలో ఆర్టీవో కార్యాలయాల్లో ఫిట్‌నెస్‌కు ప్రభుత్వ ఛలానాతో పాటు అదనంగా వసూలు చేసిన అవినీతి సొమ్మును ఈ కొత్త విధానంలో కూడా వసూలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. రాజానగరంలోని ఏటీఎస్‌లో అక్క డి నిర్వాహకుడు ఒకరు జిల్లాలోనీ ఆర్టీఏ ఏజెం ట్లను పిలిచి సుమారు గంట సేపు సమావేశం నిర్వహించడం గమనార్హం. గతంలో ఎలా అ యితే వాహనదారుల నుంచి అదనంగా వసూలు చేసి అధికారులకు ఇచ్చేవారో.. అలాగే తమకు కూడా ఇవ్వాలని, అపుడే మీ కమీషన్ మీకు వస్తుందని స్పష్టం చేసినట్టు సమాచారం. త్వరలో రవాణా అధికారులతో కూడా తాము లోపాయికారిగా ఒప్పందం పెట్టుకుంటామని చెప్పినట్టు సమాచారం.దీనిపై ఏజెంట్లు స్పం దించి ఒక నెల తమకు గడువు ఇస్తే తర్వాత ఎలా చేయమంటే అలా చేస్తామని కూడా చెప్పి నట్టు సమాచారం.ఇదిలా ఉండగా గతంలో ర వాణా శాఖ అధికారులు వసూలు చేసిన జాబి తా ఒకటి బయటకు రావడం గమనార్హం.
రెండేళ్ల ఆదాయం జేబుల్లోకే!
సాధారణంగా వాహనాల ఫిట్‌నెస్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.కోట్ల ఆదాయం వచ్చే ది. జిల్లాలో వేలాది వాహనాలు ఉన్నాయి. కేంద్ర ట్రాన్స్‌పోర్టు ఇండియా సలహా మేరకు ఏటీ ఎస్‌లు రెండేళ్ల పాటు వాహనాల నుంచి ఫిట్ నెస్ టెస్ట్ కోసం వసూలు చేసిన సొమ్మం తా సొంతానికి వినియోగించుకోవచ్చు. ప్రభు త్వానికి ఒక పైసా కూడా చెల్లించన వసరం లేదు.ఇది టెండర్ విధానంలో పెట్టిన నిబంధ నగా చెబుతున్నారు. ఒక్కో ఏటీఎస్‌కు ఖర్చు రూ.4.5 కోట్లు అవుతుందని నిర్వాహకుల కథ నం.ప్రతి స్టేషన్‌లో మిషనరీతో పాటు 21 మం ది సిబ్బంది ఉంటారు.ప్రభుత్వం గతంలో వసూలు చేసిన చలానా కంటే సుమారు రూ.200లకు పైగా పెంచినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం ఏటీఎస్ చలానా ఽధరల ప్రకారం లైట్ మోటారు వెహికల్ కేటగిరీకి అంటే ఆటో నుంచి మొదలు మిగతా అన్నింటికి ఫిట్‌నెస్ పరీక్షకు రూ.860 వసూలు చేయాలి.హెవీ మో టారు వెహికిల్స్‌కు రూ.1320 వసూలు చేయా లి.రోజుకు ఒక్కో స్టేషన్‌లో 50 వాహనాలకు టె స్ట్‌లు చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు.