Share News

తెలియని రోగం... తెగ ఇబ్బంది!

ABN , Publish Date - Sep 08 , 2025 | 12:45 AM

రాజవొమ్మంగి సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో తెలియని రోగంతో మూడు గ్రామాల ప్రజలు మం చం పట్టారు. మండలంలోని లబ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాల ప్రజలు గత 2 నెలలుగా అనారోగ్యంతో ఆసుపత్రులకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. 3 గ్రామాల్లో ప్రజలకు ఓకే రీతిగా.. జ్వరం

తెలియని రోగం... తెగ ఇబ్బంది!
కిండ్ర గ్రామంలో రామాలయ ఆరుబయట జారబడ్డ జనం

లబ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాల ప్రజల అవస్థలు

జ్వరం, కీళ్ల, నడుం నొప్పులతో సతమతం

రాజవొమ్మంగి సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): అల్లూరి జిల్లా రాజవొమ్మంగి మండలంలో తెలియని రోగంతో మూడు గ్రామాల ప్రజలు మం చం పట్టారు. మండలంలోని లబ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాల ప్రజలు గత 2 నెలలుగా అనారోగ్యంతో ఆసుపత్రులకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. 3 గ్రామాల్లో ప్రజలకు ఓకే రీతిగా.. జ్వరం రావడం ఆసుపత్రికి వెళ్లి మందులు వాడిన తరువాత జ్వరం తగ్గుముఖం పట్టి, కీళ్ల నొ ప్పులు, నడుం పట్టేసి మంచంపై నుంచి సైతం లెగలేకుండా ఉంటున్నారు. నిత్యం పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్లెట్లు వేసుకుంటే తప్ప కాలకృత్యాలు కూడ తీర్చుకోలేని పరిస్థితి. ఈ గ్రామాల ప్ర జలు లాగరాయి ప్రభుత్వ ఆసుపత్రిలో మందులు వాడిన పనిచేయలేదని, మైదాన ప్రాంతాలలో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకుంటున్నామని వాపోయారు. దీనిపై రాజవొమ్మ ంగి ఎంపీపీ గోము వెంకటలక్ష్మి మాట్లడుతూ గతంలో దీనిపై జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేయడంతో డీఎంహెచ్‌వోని పంపాగా రోగులను పరిశీలించి బ్లడ్‌ శాంపిల్స్‌ను ల్యాబ్‌కి పంపినా అధికారులు నేటికి ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. ప్రజలు మృత్యువాత పడితే కాని స్పందించరా అని ఎంపీపీ ప్రశ్నించారు. అయి తే పారిశుధ్య లోపమా, నీటి కాలుష్యమా, వైద్యులు పట్టించుకోని వైనమా తెలియదు కాని ఉన్నతాధికారులు తక్షణం స్పందించి గ్రామాల్లో తాము పడుతున్న అనారోగ్య సమస్యలపై చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Sep 08 , 2025 | 12:45 AM