Share News

రంగా విగ్రహాలు..రగిలిన ఆందోళనలు!

ABN , Publish Date - May 30 , 2025 | 12:37 AM

అంతర్వేది, మే 29(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తపేట సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఒక వర్గంవారు రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. మరొక వర్గంవారు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించి పోలీసులకు తెలియచేయడంతో పోలీసులు తెల్లవారుజామున విగ్రహాన్ని తొలగించారు. దీంతో ఆగ్రహించిన కాపు సంఘాల నాయకులు

రంగా విగ్రహాలు..రగిలిన ఆందోళనలు!
ధర్నా చేస్తున్న నాయకులు, మహిళలు, గ్రామస్తులు

అంతర్వేదిలో రంగా విగ్రహం తొలగింపుపై వివాదం, ఉద్రిక్తత

రోడ్డుపై బైఠాయించిన నాయకులు

కొత్తపల్లిలో రంగా విగ్రహం చేతులు విరగొట్టిన వైనం

అంతర్వేది, మే 29(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తపేట సెంటర్‌లో బుధవారం అర్ధరాత్రి వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఒక వర్గంవారు రాత్రికి రాత్రే ఏర్పాటు చేశారు. మరొక వర్గంవారు విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించి పోలీసులకు తెలియచేయడంతో పోలీసులు తెల్లవారుజామున విగ్రహాన్ని తొలగించారు. దీంతో ఆగ్రహించిన కాపు సంఘాల నాయకులు, గ్రామస్తులు విగ్రహాన్ని తొలగించిన ప్రదేశంలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేస్తూ ప్రధాన రహదారిపై ధర్నా చేశారు. ఈ తరుణంలో పోలీసులు, రంగా అభిమానులకు మధ్య తోపులాట జరిగింది. రాజోలు నియోజకవర్గ నాయకులు, కాపు సంఘాల నాయకులు, మహిళలు రోడ్డుపై బైఠాయించి రంగా విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటుచేయాలని నినాదాలు చేశారు. పోలీసులవో వాగ్వాదం చేస్తూ రంగా విగ్రహాన్ని తీసిన చోటే గ్రామస్తులు పెట్టారు. ఈ తోపులాటలో రంగా విగ్రహం చేయి విరిగింది. అనంతరం విగ్రహానికి దండలు వేసి కాపు సంఘ నాయకులు, మహిళలు ధర్నా చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఇరువర్గాలతో చర్చలు జరుపగా అమలాపురం ఆర్డీవో మాధవి, డీఎస్పీ మురళీమోహన్‌ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌ కోసం ఎదురుచూడ సాగారు. మధ్యాహ్నానికి ఎమ్మెల్యే సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని పరిశీలించి ఇరువర్గాలతో చర్చలు జరిపారు. ఇరువర్గాల నుంచి చెరొక ఐదుగురు సభ్యులను స్థానిక పంచాయతీ భవనంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటుచేసి వారితో మాట్లాడి పరిస్థితులు చేజారిపోకుండా శాంతింపచేశారు. అన్నివర్గాల నాయకుల విగ్రహాలకు ఇబ్బంది లేకుండా విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. విగ్రహం ఎత్తు, దిమ్మ, నిర్మాణాలు సక్రమంగా అవతలవారి డిమాండ్ల మేరకు విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇచ్చి ఇరువర్గాలతో శాంతియుతంగా చర్చలు జరిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్‌, రాజోలు సీఐ నరేష్‌కుమార్‌, రాజోలు, సఖినేటిపల్లి, మలికిపురం ఎస్‌ఐలు పటిష్ట బందోబస్తు చర్యలు తీసుకున్నారు. సీఐ నరేష్‌, తహశీల్దార్‌ వెంకటేశ్వరరావు, రాజోలు, మలికిపురం, సఖినేటిపల్లి ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

కొత్తపల్లిలో ధర్నా

కొత్తపల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొ త్తపల్లి ఊరచెరువు సెంటర్లో కాపు నాయకుడు వంగవీటి మోహనరంగా విగ్రహం చేతులు విరగొట్టిన వారిపై చర్య లు చేపట్టాలని జనసేన, రంగా యూత్‌ ఆధ్వర్యంలో గు రువారం ఆందోళన చేపట్టారు. ఇటీవల సెంటర్లో ఉన్న రంగా విగ్రహం చేతి వేళ్లను గుర్తు తెలియని వ్యక్తి విర గొట్టాడని, గురువారం తెల్లవారుజామున విగ్రహం చేతి మణికట్టు వద్ద విరగొట్టి పక్కనే ఉన్న చెరువులో విసి రేశారని జనసేన, రంగా యూత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపల్లి ఎస్‌ఐ జి.వెంకటేష్‌ విగ్రహాన్ని పరిశీలించి నిందితుడిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపడతామని హామీఇవ్వడంతో ఆందోళన విరమించారు. జనసేన నాయ కులు కొణమర్తి రాంబాబు,ఆటో పెద్ద, భరత్‌, రాజారావు, మోకా పెద్దకాపు, బాబులు, మామిడాల రమణ, మోహన రంగాయూత్‌ సానా లోవరాజు, గంధం గంగ పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2025 | 12:37 AM