‘వంగవీటి రంగా కారణజన్ముడు’
ABN , Publish Date - Jul 05 , 2025 | 12:48 AM
మలికిపురం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వంగవీటి రంగా కారణ జన్ముడని, మూడు దశాబ్దాలు క్రితం ప్రజల నుంచి దూరమైనా వారి మదిలో చిరస్థాయిగా ఉన్న మహా నాయకుడని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా అన్నారు. శుక్రవారం రంగా జయంతి సందర్భంగా కోనసీ

మలికిపురం, జూలై 4 (ఆంధ్రజ్యోతి): వంగవీటి రంగా కారణ జన్ముడని, మూడు దశాబ్దాలు క్రితం ప్రజల నుంచి దూరమైనా వారి మదిలో చిరస్థాయిగా ఉన్న మహా నాయకుడని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధా అన్నారు. శుక్రవారం రంగా జయంతి సందర్భంగా కోనసీమ జిల్లా మలికిపురంలో రంగా నిలువెత్తు విగ్రహాన్ని అభిమానులు ఏర్పాటు చేయగా వారిద్దరూ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ రంగా ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. బడుగు, బలహీనవర్గాల కోసం నిరంతరం పోరాటం చేసి బడుగుల కోసమే ప్రాణాలు అర్పించిన మహానేత అన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెదకాపు, దిరిశాల బాలాజీ, గెడ్డం మహలక్ష్మిప్రసాద్, పినిశెట్టి బుజ్జి, ముప్పర్తి నాని, బొల్లం ప్రసాద్, ఎంపీపీ ఎంవీ సత్యవాణి తదితర నాయకులు పాల్గొన్నారు. వంగవీటి రాధాను చించినాడ వంతెన నుంచి యువకులు భారీగా ర్యాలీగా తీసుకువచ్చారు. దారి పొడవునా యువకులు నినాదాలు చేశారు.