Share News

వంగవీటి మోహనరంగా అందరివాడు

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:32 AM

పేద, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ అని తీర ప్రాంత గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అన్నారు.

వంగవీటి మోహనరంగా అందరివాడు

అంతర్వేది, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): పేద, బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ అని తీర ప్రాంత గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు అన్నారు. ఆదివారం అంతర్వేది కొత్తపేట సెంటర్‌లో రంగా విగ్రహాన్ని నాలుగు గ్రామాల ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన రంగా విగ్రహం ఏర్పాటు ఆదివారం కొలిక్కి వచ్చింది. గ్రామస్తులు ఏర్పాటుచేసిన రంగా విగ్రహాన్ని అన్ని సామాజికవర్గాలు సంయుక్త నిర్వహణలో ఆవిష్కరించారు. సర్పంచ్‌లు ఒడుగు శ్రీను, కొండా జాన్‌బాబు, పోతురాజు నరసింహారావు(కిశోర్‌), దొండపాటి రవికుమార్‌, మేడిద మోహన్‌, ఎంపీటీసీ సభ్యులు బైరా నాగరాజు, చొప్పల బాబూరావు, ఉండపల్లి అంజి, రావూరి నాగు, జిల్లెల్ల నరసింహ (రక్షక్‌), స్థానిక యువనాయకులు, రంగా అభిమానులు, కలిదిండి, ప్రకాశపురం, కొత్తపేట నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 12:32 AM