Share News

వడిశలేరు... పందాల హోరు!

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:31 AM

రంగంపేట, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి ముందే పండుగ వాతావరణం వచ్చి ందని రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ మం త్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో గన్నివారి తోటలో గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్ధం జిఎస్‌ఎల్‌ అధి

వడిశలేరు... పందాల హోరు!
పోటీలను ప్రారంభిస్తున్న దుర్గేష్‌

వడిశలేరులో రాష్ట్రస్థాయి ఎడ్లబండ్ల, గుర్రపు పరుగు పందాలు

ప్రారంభించిన మంత్రి దుర్గేష్‌

పాల్గొన్న ప్రజాప్రతినిధులు

రంగంపేట, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతికి ముందే పండుగ వాతావరణం వచ్చి ందని రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ మం త్రి కందుల దుర్గేష్‌ అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరు గ్రామంలో గన్నివారి తోటలో గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్ధం జిఎస్‌ఎల్‌ అధినేత గన్ని భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహిం చిన 7వ రాష్ట్రస్థాయి గుర్రపు,ఎడ్లబండ్ల పరుగు పందా లను ఉదయం 7.30 గంటలకు మంత్రి ప్రారంభించి మాట్లాడారు. స్వయంగా గుర్రం మీద ఎక్కి తిరిగారు. ఎడ్ల బండ్ల పరుగు పందాలు మన గ్రామీ ణ సంస్కృతికి అద్దం పడతాయని.. రైతు జీవితం, సంప్రదాయాలు, ఐక్యతను ఈ పోటీలు ప్రతిబింబిస్తున్నాయన్నారు. ఎడ్లు వ్యవసాయానికి ప్రాణం. వాటి సంరక్షణతో పాటు గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందన్నారు. యువత చెడు అలవాట్లకు దూరం గా ఉండి క్రీడలు, సంస్కృతి వైపు అడుగులు వేయాలన్నారు. బహుమతి ప్రదానోత్సవానికి విచ్చేసిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పండగల్లో పశువులను పూజించడం కూడా అంతర్భాగం అన్నారు. అధు నాతన వైద్యం అందిస్తూ కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, ప్రకృతిని పరిరక్షించడం కోసం డాక్టర్‌ గన్ని భాస్కరరావు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. సుమారు 10 వేల మంది వస్తారని అంచనావేస్తే దాని కి పదిరెట్లు మంది జనాలు వచ్చినా అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన పోలీసులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి, కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీ మాగంటి భరత్‌, తీగలరాజా, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవిం దు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఎడ్లబళ్ల పోటీలలో విజేతలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్‌ బొడ్డు వెంకటరమణచౌదరి బహుమతులు అందించగా, గుర్రపు పోటీల్లో విజేతలకు గన్ని భాస్కరరావు, గన్ని కృష్ణ నగదు బహుమతులు అందించారు.

విజేతలు వీరే

ఎడ్లబండ్ల పోటీల్లో సీనియర్‌ విభాగంలో...

మొదటి స్థానం మలిరెడ్డి అన్నపూర్ణ (జి.మేడపాడు) బుల్లెట్‌, ద్వితీయస్థానం కోరా శృతిచౌదరి (గుమ్మిలేరు) హోండాషైన్‌ 125

తృతీయస్థానం కోరా శృతిచౌదరి (గుమ్మిలేరు, కోనసీమ) హోండాషైన్‌ 100.

జూనియర్‌ విభాగంలో..

మొదటి స్థానం గెడ్డం అప్పారావు (చౌడవాడ, అనకాపల్లి) బుల్లెట్‌

ద్వితీయస్థానం కొండేటి పద్మ (కంకటపాలెం) హోండాషైన్‌ 125

తృతీయస్థానం మురుకుర్తి శంకరరావు (బి.కొత్తూరు, అనకాపల్లి)హోండాషైన్‌ 100సీసీ.

గుర్రపు పరుగు పందెంలో విజేతలు...

1 మణికంఠ (జెస్సి), (చేనుల అగ్రహారం, అనకాపల్లి - 40,000

2. ఎల్లపు జగదీష్‌ (యలమంచిలి)- 30,000

3.చోడమాంబిక (విక్రమ్‌) (చేనుల అగ్రహారం, అనకాపలి- 25,000

4.సింగపూర్‌ సత్యనారాయణ (శక్తి) విజయనగరం జిల్లా కొట్టపాడు మండలం తలారి గ్రామం -20,000

5.మోదమాంబ మురగన్‌ (అనుకుపాలెం, అనకాపల్లి )-15,000

6.ఎల్లపు జగదీష్‌ (సోమలింగపాలెం, అనకాపల్లి)- 10,000

7.శివరాజు బ్రదర్స్‌ (కోటనందూరు)- 10,000 వారికి నగదు బహుమతులు అందుకున్నారు.

Updated Date - Dec 29 , 2025 | 01:31 AM