Share News

వాడపల్లిలో ముగిసిన వెంకన్న పవిత్రోత్సవాలు

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:22 AM

ఆత్రేయపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 3 రోజుల పాటు తిరుమ ల తరహాలో నిర్వహించిన పవిత్రోత్సవాలు బుధవారంతో ఘ నం గా ముగిశాయి. వసంతమండపంలో ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవ

వాడపల్లిలో ముగిసిన వెంకన్న పవిత్రోత్సవాలు
ఆలయంలో పవిత్రోత్సవ పూజల దృశ్యం

ఆత్రేయపురం, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో 3 రోజుల పాటు తిరుమ ల తరహాలో నిర్వహించిన పవిత్రోత్సవాలు బుధవారంతో ఘ నం గా ముగిశాయి. వసంతమండపంలో ఉత్సవ మూర్తులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, మహాశాంతిహోమం, ప్రాయిశ్చిత్త హోమం, మహాపూర్ణాహుతి, పవిత్రవిసర్జన, మహాదాశీర్వచనం, తదితర కార్యక్రమాలను వైఖానస ఆగమ శాస్త్ర ప్రకా రం ఖండవిల్లి రాజేశ్వరవరప్రసాదచార్యులు బ్రహ్మత్వంలో వేదపండితులు స్వామివారి పవిత్రోత్సవాలను నిర్వహించారు. స్వామివారి మూలవిరాట్‌ కు పవిత్రాలను అలంకరించారు. స్థాని క ఎమ్మెల్యే బండారు సత్యానందరా వు, ఉపకమిషనర్‌ ఈవో నల్లం సూర్యచక్రధరరావు, డీఎస్పీ సుంకర మురళీమోహన్‌, కూటమినాయకులు, దాత లు స్వామివారిని దర్శించుకున్నారు.

అభివృద్ధి పనుల పరిశీలన

వెంకన్న ఆలయంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పశ్చిమగోదావరి జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు ఎస్‌.శ్రీరామరాజు, భారతి విద్యాభవన్‌ చైర్మన్‌ ఉద్దరాజు విశ్వనాధరాజు, రైస్‌మిల్లర్స్‌ అసోషియేషన్‌ సెక్రటరీ కొత్త శ్రీనివాస్‌, గాంధీ, సురేష్‌ ప్ర ముఖలతో కలిసి పరిశీలించారు. వకుళమాత అ న్నదాన భవనంలో రూ.1.50కోట్లతో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రామరాజును కోరగా సానుకూలంగా స్పందించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కాటేజీ నిర్మాణానికి రూ.10లక్షల విరాళం అందించేందుకు కొత్త శ్రీనివాస్‌ ముందుకు వచ్చారని తెలిపారు.

Updated Date - Aug 07 , 2025 | 12:22 AM