Share News

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.5.59 లక్షలు

ABN , Publish Date - Jun 09 , 2025 | 01:07 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.5.59 లక్షలు

ఆత్రేయపురం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనం తరం భక్తజనం అన్నప్రసాదంలో పాలొ ్గన్నా రు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.5,59,390 వచ్చినట్టు ఉపకమిషన రు, ఈవో ఎన్‌.సూర్యచక్రధరరావు తెలిపారు.

తిరునక్షత్ర ఉత్సవాలు.. వాడపల్లి వెంకన్న క్షేత్రంలో మూడవ రోజు శనివారం నమ్మళ్‌వార్‌ తిరునక్షత్ర ఉత్సవాలు, నాల్గో రోజు ఆదివారం ద్రవిడ వేద పారాయణం నిర్వహించారు. సాయంత్రం వేదమంత్రాల మధ్య స్వామివారి పల్లకీ ఉత్సవాన్ని ఘనంగా జరిపారు.

పార్కింగ్‌ ప్రదేశంలో మెరక పనులు

ఆత్రేయపురం, (ఆంధ్రజ్యోతి): వాడపల్లి ఆల యానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ కష్టాలతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతు న్నాయి. శ్రీనివాస ప్రాంగణంలోని ఏడు ఎకరాల స్థలంలో పార్కింగ్‌ సరిపోకపోవడంతో గోదావరి చెంతనే మరో ఆరు ఎకరాల్లో కారు పార్కింగ్‌ ఏర్పాటు చేశారు. అది కూడా సరిపోకపోవడం తో వాహనాలను ఎక్కడపడితే అక్కడ పార్కిం గ్‌ చేస్తున్నారు. దర్శనం అనంతరం బయటకు వెళ్లే వాహనాలు ఇరుకు ప్రదేశం కావడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది. కొత్త రోడ్డులోని శివాలయానికి చెందిన 8 ఎకరాల భూములను పార్కింగ్‌ కోసం మెరక చేస్తున్నారు. వీటి పనులు పూర్తయితే పార్కింగ్‌ కష్టాలు తొలగనున్నాయి. అభివృద్ధి పనులను ఉపకమిషనరు పర్యవేక్షించారు.

Updated Date - Jun 09 , 2025 | 01:08 AM