Share News

వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

ABN , Publish Date - May 25 , 2025 | 12:59 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. వేకువజామునే స్వామివా రికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మిహోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలకరించారు.

వెంకన్న ఆలయానికి పోటెత్తిన భక్తజనం

ఆత్రేయపురం, మే 24(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తజనం పోటెత్తారు. వేకువజామునే స్వామివా రికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మిహోమం, బాలభోగం తదితర కార్యక్రమాలను నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలకరించారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి తిరు వీధులలో ఏడు ప్రదక్షిణలు చేసి మొ క్కులు చెల్లించారు. భారీ క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్న భక్తులు తులభారాలు, కా నుకలు సమర్పించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. అనంతరంరాత్రి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. వివిధ సేవల ద్వారా స్వామివారి ఒక్కరోజు ఆదాయం రూ.55.33 లక్ష లు వచ్చినట్టు ఉపకమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. వానను సైతం లెక్కచేయకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వానలో తడిసి స్వామివారి ప్రదక్షణలు నిర్వహించుకుని మొక్కలు తీర్చుకున్నారు. అలాగే లొల్ల లాకులవద్ద శనివారం గంటల తరబడి ట్రాఫిక్‌ స్తంభించింది. లొల్ల వద్ద సైఫాన్‌ నిర్మాణ పనులు వేగంగా రూపొందించడంతో ఆర్‌అండ్‌బీ రోడ్డు ఇరుకుగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వెంకన్న ఆలయానికి వేలాదిగా భక్తులు రావడంతో లొల్లలాకుల వద్ద ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

Updated Date - May 25 , 2025 | 12:59 AM