వెంకన్న ఆదాయం రూ.3.58 లక్షలు
ABN , Publish Date - May 22 , 2025 | 01:15 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది.
ఆత్రేయపురం, మే 21(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తజనం అష్టో త్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్త జనం అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒకరోజు ఆదాయం రూ.3,58, 649 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
వెంకన్న ఆలయంలో రాజసభ సభ్యుడి పూజలు: వాడపల్లి ఆలయంలో బుధవారం రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. రాజ్యసభ సభ్యుడి హోదాలో తొలిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చక బృందం స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం వేదాశీర్వచనం తీసు కున్నారు. ఆయనకు ఆలయ సిబ్బంది స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు.