Share News

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2.42లక్షలు

ABN , Publish Date - May 21 , 2025 | 12:32 AM

వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది.

వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.2.42లక్షలు

ఆత్రేయపురం, మే 20(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్త జనం అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనం తరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.2,42,072 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావుతెలిపారు. వకుళమాత అన్నదాన భవన నిర్మాణానికి రావులపాలానికి చెందిన కర్రి వెంకటరెడ్డి, కమలావతి దంపతులు రూ.1,01,116 విరాళం ఇచ్చారు. ఆలయ సిబ్బంది దాతలకు స్వామివారి చిత్రపటం అందజేశారు.

ముఖద్వారం నిర్మాణానికి సీఎంఆర్‌ చైర్మన్‌ శంకుస్థాపన: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం దాతల విరాళాలతో అభివృద్ధి చెందుతోంది. స్ధానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆదేశాల మేరకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి అభివృద్ధి పనులకు బాటలు వేస్తున్నారు. స్వామివారి ఆలయానికి వెళ్లే మార్గాల వద్ద ముఖద్వారాల నిర్మాణానికి దాతల సహకారం కోరారు. రావులపాలెం కళా వెంకట్రావు సెంటర్‌ వద్ద ముఖద్వారం నిర్మించేందుకు సీఎంఆర్‌ సంస్థ చైర్మన్‌ మావూరి వెంకటరమణ దంపతులు ఇటీవల శంకుస్థాపన చేశారు. శిల్పి వడయార్‌ నేతృత్వంలో రూ.30 లక్షలతో ముఖద్వారం రూపుదిద్దుకోనుంది. బొబ్బర్లంక వద్ద ఆలయానికి వెళ్లే లొల్ల కొత్త వంతెన వద్ద ముఖద్వారాల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు ఆలయ ఉపకమిషనరు, ఈవో సూర్యచక్రధరరావు తెలిపారు.

Updated Date - May 21 , 2025 | 12:32 AM