వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.4.14 లక్షలు
ABN , Publish Date - May 20 , 2025 | 01:09 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది.
ఆత్రేయపురం, మే 19(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్యకళ్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న భక్తు లు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ. 4,14, 159 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
ఘనంగా జగన్మోహిని కేశవస్వామి మాస కల్యాణం
ఆత్రేయపురం, మే 19(ఆంధ్రజ్యోతి): ర్యాలి జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో సోమవారం శ్రావణ నక్షత్ర మాస కల్యాణం నిర్వ హించారు. విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం, నీరాజన మంత్రపుష్పం తదితర కార్యక్రమాలను నిర్వహించి స్వామివారి కల్యాణాన్ని జరిపారు. స్వామివారిని వేదిక వద్దకు తీసుకు వచ్చి కల్యాణం నిర్వహించారు. ఆలయ ఈవో బీహెచ్‌వీ రమణమూర్తి వీటి ఏర్పాట్లను పర్య వేక్షించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి కల్యాణాన్ని తిలకించి అన్న ప్రసాదంలో పాల్గొన్నారు.