కిక్కిరిసిన వాడపల్లి వెంకన్న ఆలయం
ABN , Publish Date - May 18 , 2025 | 01:14 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు.
ఆత్రేయపురం, మే 17(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తజనం పోటెత్తారు. వేకుమజామునే స్వామివారికి సుప్రభాతసేవ, నీరాజన మంత్రపుష్పం, ఐశ్వర్యలక్ష్మి హోమం, బాలబోగం తదితర కార్యక్రమాలను శాస్రోక్తంగా నిర్వహించి స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అలకరించారు. వివిధ రాష్ర్టాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి తీరువీధుల్లో ఏడు ప్రదక్షిణలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. స్వామివారిని దర్శించుకున్న భక్త్తులు తులభారాలు, కానుకలు సమర్పించిన అనంతరం అన్న ప్రసాదంలో పాల్గొ న్నా రు. అనంతరం రాత్రి వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. పగలు ఎండ, సాయంత్రం చిరుజల్లుల మధ్య భక్తజనం నోము ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ సేవల ద్వారా స్వామి వారి ఒక్కరోజు ఆదాయం రూ.54.35 లక్షలు లభించినట్టు ఉపకమీషనరు నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు.