వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.4.30 లక్షలు
ABN , Publish Date - May 12 , 2025 | 12:53 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తో రద్దీ నెలకొంది
ఆత్రేయపురం, మే 11(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల తో రద్దీ నెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్త జనం అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ. 4,30,532 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.