వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.4.17 లక్షలు
ABN , Publish Date - May 02 , 2025 | 01:39 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది.
ఆత్రేయపురం, మే 1(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంత రం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.4,17,561 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. చంటి పిల్లలతో పలువురు తులాభారం నిర్వహించారు.
తిరునక్షత్ర ఉత్సవాలు: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఐదురోజుల పాటు నిర్వహించిన తిరునక్షత్ర ఉత్సవాలు గురువారంతో ముగిశాయి. ఆళ్వార్ సన్నిధిలో మేల్కొలుపు, నీరాజన మంత్రపుష్పం, ద్రవిడ వేదపారాయణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం రామానుజ ఆళ్వార్ పల్లకి మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఆయా ఏర్పాట్లను ఈవోతో పాటు, సిబ్బంది పర్యవేక్షించారు.