వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.4.03లక్షలు
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:04 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది.
ఆత్రేయపురం, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజలు, నిత్య కల్యాణాలు జరిపారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.4,03, 650 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు.
ఘనంగా తిరునక్షత్ర ఉత్సవాలు: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం లో తిరునక్షత్ర ఉత్సవాలు రెండో రోజు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆళ్వార్ సన్నిధిలో మేల్కొలుపు, నీరాజన మంత్రపుష్పం, ద్రవిడ వేదపారాయణం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం రామానుజ ఆళ్వార్ పల్లకి ఉత్సవాన్ని జరిపారు. ఆలయ ఈవో వీటి ఏర్పాట్లను పర్యవేక్షించారు.