వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.4.80లక్షలు
ABN , Publish Date - Apr 19 , 2025 | 01:07 AM
వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది.
ఆత్రేయపురం, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీనెలకొంది. నోము ఆచరించిన భక్తజనం అష్టోత్తర పూజలు, నిత్యకల్యాణాలు చేశారు. స్వామివారిని దర్శించుకున్న అనంత రం భక్తజనం అన్నప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవల ద్వారా ఒక్కరోజు ఆదాయం రూ.4,80,428 వచ్చినట్టు ఉపకమిషనరు, ఈవో నల్లం సూర్యచక్రధరరావు తెలిపా రు. వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి కృష్ణా జిల్లా పడమటకు చెందిన పాలడుగు రామనాఽథబాబు కుటుంబ సభ్యులు రూ. 50,116లు, వాడపల్లికి చెం దిన ఎస్.ఎరకయ్య, సూర్యాకాంతం దంపతులు రూ.30,116 విరాళాలు ఇచ్చారు. దాతలకు స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఆల యంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులతోపాటు భక్తుల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.