బ్రహ్మాండంగా బ్రహ్మోత్సవాలు..
ABN , Publish Date - Oct 13 , 2025 | 01:09 AM
ఆత్రేయపురం, అక్టోబరు 12 (ఆంధ్ర జ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు ఆదివారం బ్రహ్మాండంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొని తరించారు. ఉద యం స్వామివారిని వసంత మండపంలో సర్వాం గ సుందరంగా అలంకరించిన వేదిక వద్దకు తో డ్కొని వచ్చి వైఖానస శాస్త్ర ప్రకారం ఖండవల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేదపడింతు
వాడపల్లి వెంకన్న సన్నిధిలో మహాసుదర్శన హోమం
వైభవంగా తోమాల సేవ
ఆకట్టుకున్న ప్రదర్శనలు
ఆత్రేయపురం, అక్టోబరు 12 (ఆంధ్ర జ్యోతి): కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజు ఆదివారం బ్రహ్మాండంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు పాల్గొని తరించారు. ఉద యం స్వామివారిని వసంత మండపంలో సర్వాం గ సుందరంగా అలంకరించిన వేదిక వద్దకు తో డ్కొని వచ్చి వైఖానస శాస్త్ర ప్రకారం ఖండవల్లి రాజేశ్వరవరప్రసాదాచార్యులు బ్రహ్మత్వంలో వేదపడింతులు, అర్చకులు బ్రహ్మోత్సవ పూజలను నిర్వహించారు. ఉదయం 9.10 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యహవచనము, పంచామృత మండపారాధన, మహాసప్ననము, హోమములు, దుష్టగ్రహా పరిహారార్ధం మహాసుదర్శన హోమం, వేదమంత్రా ల సాక్షిగా నిర్వహించారు. అనంతరం మేళతాళ మంగవాయిద్యాలతో తోమాల ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. అనం తరం స్వామివారికి సమర్పించి తోమాల సేవను నిర్వహించారు. కేరళవాయిద్యాలు, కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సాయంత్రం స్వస్తివచనం ప్రధాన హోమములు, విశేష అర్చన, చతుర్వేద స్వస్తి తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు, డిప్యూటీ కమిషనరు నల్లం సూర్యచక్రధరరావు దంపతులు పాల్గొన్నారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్‌శోభగుల నడుమ శ్రీవారు కోదండరామ అలంకరణలో అలంకృతుడై హనుమత్‌వాహనం పై తిరువీధుల్లో వివిధ కళాకారుల ప్రదర్శనల నడుమ విహరించి కృపాకటాక్షాలు అందించారు.
నేడు..
వాడపల్లిలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాల్గో రోజు సోమవారం యోగనారసంహ అలంకరణలో శ్రీవారి సింహవాహన సేవ త దితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు.