Share News

దేఖ్‌లేంగే..ఉస్తాద్‌!

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:04 AM

గండేపల్లి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్శిటీని ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టీమ్‌ శనివారం

దేఖ్‌లేంగే..ఉస్తాద్‌!
వేదికపై దేవిశ్రీప్రసాద్‌, హరీష్‌శంకర్‌ స్పీచ్‌

ఆదిత్య యూనివర్సిటీలో ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ సినిమా దేఖ్‌ లేంగే పాట విడుదల

హాజరైన దర్శకుడు హరీష్‌శంకర్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌, నిర్మాత నవీన్‌ యెర్నేని

గండేపల్లి, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెంలోని ఆదిత్య యూనివర్శిటీని ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ టీమ్‌ శనివారం ఉర్రూతలూగించారు. జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ నటించిన ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ సినిమాలోని దేఖ్‌ లేంగే సాంగ్‌ను ఆదిత్య యూనివర్శిటీలో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు హరీష్‌శంకర్‌, మ్యూ జిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీప్రసాద్‌, నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్‌ నవీన్‌ యెర్నేని, పాటల రచయిత భాస్కర భట్ల హాజరయ్యా రు. ఈ సందర్భ ంగా ఆదిత్య యూ నివర్శిటీ ప్రో చాన్సలర్‌ డాక్టర్‌ నల్లమిల్లి సతీష్‌రెడ్డి పా టను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దే వీశ్రీప్రసాద్‌ తన పాటలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు.

వైబ్‌ అదిరిపోయింది : హరీష్‌శంకర్‌

డైరెక్టర్‌ హరీష్‌శంకర్‌ మాట్లాడుతూ రోజు ప్రారంభించే ముందు సూర్యుడికి దణ్ణం పెట్టి రోజు ప్రారంభిస్తామని, ఈ సినిమా ప్రమోషన్‌ అంతే పవిత్రంగా ఆదిత్య కాలేజీ నుంచి ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఆదిత్య వైబ్‌ అదిరిపోయిందన్నారు. దేవిశ్రీప్రసాద్‌తో మూ డుసార్లు పనిచేశానని, మరో మూడుసార్లు పనిచేయాలన్నారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న వ్యక్తిని మ్యూజిక్‌తో స్టార్‌ డైరెక్టర్‌ చేసిన వ్యక్తి దేవీశ్రీప్రసాద్‌ అని కొని యాడారు. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ లేకపోతే ఈ సినిమాలేదన్నారు. మైత్రీ సంస్థ ఇండియాలో నెంబర్‌ వన్‌ ప్రొడక్షన్‌ హౌస్‌గా నిలబడిందని, మైత్రీ మూవీస్‌లో పనిచేయడం వరమని ఇలాం టి ప్రొడ్యూసర్లు దొరకడం అదృష్టమన్నారు. ‘‘పవన్‌ వల్ల షూటింగ్‌ చా లా స్పీడ్‌గా అయిపోయింది. ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయనకు కృతజ్ఞత లు తెలియజేస్తున్నా. వేస విలో సినిమా విడుదల తేదీనిర్ణయించగానే ప్రక టిస్తాం’ అని హరీష్‌శంకర్‌ పేర్కొన్నారు. నిర్మా త నవీన్‌ మాట్లాడుతూ యువతకు నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో పొందుపర్చామని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ప్రో చాన్సలర్‌ డాక్టర్‌ ఎం.శ్రీణివాసరెడ్డి, ప్రో వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఎ.రమేష్‌,డీన్‌ డాక్టర్‌ కిషోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 01:04 AM