Share News

యూరియాకు టోకెన్ల సిస్టం

ABN , Publish Date - Sep 07 , 2025 | 01:02 AM

కలెక్టరేట్‌(కాకినాడ), సెప్టెంబరు 6(ఆంధ్ర జ్యోతి): యూరియాను రైతులకు టోకెన్ల సిస్టం ద్వారా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి నుంచి సీఎం చంద్ర బాబు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల కలె క్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధి కారులతో ఎరువులు సరఫరాపై

యూరియాకు టోకెన్ల సిస్టం

టెలికాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు ఆదేశం

కలెక్టరేట్‌(కాకినాడ), సెప్టెంబరు 6(ఆంధ్ర జ్యోతి): యూరియాను రైతులకు టోకెన్ల సిస్టం ద్వారా పంపిణీ చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అమరావతి నుంచి సీఎం చంద్ర బాబు టెలికాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల కలె క్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, వ్యవసాయశాఖ అధి కారులతో ఎరువులు సరఫరాపై సమీక్ష నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తొలిరోజు రైతులకు టోకెన్లు క్రమ పద్ధతి లో అందజేయాలన్నారు. తర్వాత రోజు టోకెన్ల నెం బర్లను అనుసరించి యూరియా పంపిణీ చే యాలన్నారు. ప్రధానంగా పీఏసీఎస్‌లు, రైతు సేవా కేంద్రాల్లో మాత్రమే టోకెన్‌ విధానం అమ లుచేయాలన్నారు. ప్రైవేటు ఎరువుల డీలర్ల వద్ద వీఆర్వో పర్యవేక్షణలో ఎరువులను విక్రయించాలన్నారు. రాష్ట్రంలో యూరియా సమృద్ధిగా ఉందన్నారు. యూరి యా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తే చర్యలు తీసుకోవాలనిఆదేశించారు.కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ షాన్‌మోహన్‌, జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, జిల్లా వ్యవసాయశాఖ అధికారి విజయ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

600 మెట్రిక్‌ టన్నులు రాక

కరైకల్‌ నుంచి కాకినాడ జిల్లాకు శనివారం 600 మెట్రిక్‌ టన్నుల యూరియా దిగుమతి అయింది. ఆదివారం మరో 1200 మెట్రిక్‌ టన్నుల యూరియా వస్తుందని జిల్లా వ్యవసా యాధికారి విజయ్‌కుమార్‌ వెల్లడించారు. రైతులకు కొరత లేకుండా ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు.

Updated Date - Sep 07 , 2025 | 01:02 AM