Share News

యూరియా కేటాయింపు పారదర్శకత కోసం జేసీ ఆధ్వర్యంలో కమిటీ : కలెక్టర్‌

ABN , Publish Date - Sep 10 , 2025 | 02:02 AM

జిల్లాలో యూరియా కేటాయింపును పా రదర్శకంగా నిర్వహించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు.

యూరియా కేటాయింపు పారదర్శకత కోసం జేసీ ఆధ్వర్యంలో కమిటీ : కలెక్టర్‌

రాజమహేంద్రవరం రూరల్‌, సెప్టెంబరు9 (ఆం ధ్రజ్యోతి): జిల్లాలో యూరియా కేటాయింపును పా రదర్శకంగా నిర్వహించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్‌ ప్రశాంతి తెలిపారు. మంగళవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో సమన్వయ శాఖల అధికా రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమిటీలో వ్యవసాయ, సహ కార, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖాధికారులు, మార్క్‌ఫెడ్‌ డీఎం సభ్యులుగా ఉంటారన్నారు. ఎం త యూరియా అవసరమో కమిటీ సిఫారసు చే స్తుందని, ఆమేరకు కేటాయింపులు జరుగుతాయ న్నారు. కేటాయింపు తరువాత నిల్వలను సహాయ రిజిస్ట్రార్‌ తప్పనిసరిగా తనిఖీ చేయాలన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రాల వారీగా రికార్డులు సక్రమంగా నిర్వహించాలని సూచించారు. యూరియా సక్ర మంగా రైతు సేవా కేంధ్రాలకు చేరిందా లేదా అన్న ది వ్యవసాయాధికారి పరిశీలించాలన్నారు. సరఫరా చేసిన యూరియా వినియోగాన్ని వ్యవసాయ సహా యకులు తనిఖీ చేసి కనీసం 10 శాతం క్షేత్ర స్థా యిలో నిర్ధారణ జరపాలని ఆదేశించారు. అలానే ఒక రైతు సేవా కేంద్రం నుంచి మరొక కేంద్రానికి యూరియా తరలించాలంటే మండల వ్యవసాయా ధికారి అనుమతి తప్పనిసరి అని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌. మాధవరావు, జిల్లా సహకార అధికారి ఎం. వెంకట రమణ, ఉద్యాన శాఖ అధికారి ఎన్‌.మల్లిఖార్జున రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 10 , 2025 | 02:02 AM