శాంతించిన మత్స్యకారులు
ABN , Publish Date - Sep 25 , 2025 | 01:20 AM
కొత్తపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తీర ప్రాంతాల్లో నెలకొల్పిన రసాయన పరిశ్రమల వల్ల మత్స్య సంపద అంతరించిపోవడంతో తమ జీవనోపాధికి ఆటంకం కలుగుతుందని, నష్టప రిహారం చెల్లించాలని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచరోడ్డు సెంటర్లో మత్స్య కారులు చేపట్టిన
ఉప్పాడలో ఆందోళన విరమణ
వచ్చే నెల 10లోగా డిప్యూటీ సీఎం పవన ఉప్పాడ వస్తారని డీసీసీబీ చైర్మన హామీ
రాకపోతే మళ్లీ ఆందోళన చేస్తామన్న మత్స్యకారులు
కొత్తపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): తీర ప్రాంతాల్లో నెలకొల్పిన రసాయన పరిశ్రమల వల్ల మత్స్య సంపద అంతరించిపోవడంతో తమ జీవనోపాధికి ఆటంకం కలుగుతుందని, నష్టప రిహారం చెల్లించాలని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ బీచరోడ్డు సెంటర్లో మత్స్య కారులు చేపట్టిన ఆందోళనను బుధవారం సా యంత్రం తాత్కాలికంగా విరమించారు. డిప్యూటీ సీఎంతో అక్టోబరు 2నుంచి 10లోగా ఉప్పాడలో మత్స్యకారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని డీసీసీబీ చైర్మన, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామ స్వామి ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా ఆందోళన విరమించామని మత్స్య కార నాయకులు సూరాడ రాజు, ఉమ్మిడి జాన, నక్కా మణిం కంఠ తెలిపారు. తుమ్మల, జిల్లా కలెక్టర్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. వచ్చేనెల 10లోగా డిప్యూటీ సీఎం పవన ఉప్పాడ రాకపోతే మళ్లీ ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు.
కలెక్టర్ వద్దకు గుంపులుగా...
ఇదిలా ఉండగా బుధవారం ఉదయం డిప్యూ టీ సీఎం పవన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ షానమోహన మత్స్యకారుల ఆందోళన దగ్గరకు వచ్చారు. డిప్యూటీ సీఎం పేర్కొన్న పాయింట్లను కలెక్టర్ మత్స్య కారుల వద్ద ప్రస్తావించి, వేటకు వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సహనం కోల్పోయిన మత్స్యకారులతో పాటు మహిళలు మీరు తెలియజేసిన వివరాలను హామీలను నేరుగా పవనకల్యాణే ఉప్పాడ వచ్చి తమకు స్పష్టమైనహామీ ఇచ్చే వరకు ఎన్నిరోజులైనా రోడ్డుమీదే పడి ఉంటామని కలెక్టర్‌కు తెలిపారు. ఒకానొకదశలో మత్స్యకార మహిళలు ఆందోళన చేస్తున్న ప్రాంతం నుంచి కలెక్టర్ వద్దకు గుంపు లుగా వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితిని గమనించిన అడిషనల్ ఎస్పీ, కాకినాడ డీఎస్పీ మణీష్ దేవరాజ్, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ జి.వెం కటేష్ ఆధ్వర్యంలో పోలీసులు కలెక్టర్‌ను ఆందో ళనచేసే ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లారు.
మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తా
అసెంబ్లీ సమావేశాలు ముగిశాక ఉప్పాడ వస్తా : డిప్యూటీ సీఎం పవన
కొత్తపల్లి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలన్నీ తన దృష్టిలో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఉన్నతాధికా రులు, మత్స్యకారప్రతినిధులు, స్థానిక నాయకు లతో కమిటీ ఏర్పాటు చేస్తామని పిఠాపురం ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవనకల్యాణ్ హామీ ఇచ్చారు. కాలుష్య పరిశ్రమల వల్ల మత్స్యకారుల జీవనోపాఽధికి నష్టంవాటిల్లుతుందని 2 రోజులు గా చేస్తున్న ఆందోళనపై ఆయన స్పందించి బు ధవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశా రు. తీరప్రాంతాల్లో నెలకొల్పిన ఫార్మా పరిశ్రమల ప్రభావం వల్ల మత్స్యకారుల జీవనోపాధిపై ఏర్పడుతున్న ప్రభావం, ఉప్పాడ మత్స్యకారులు వ్యక్తపరిచిన ఆందోళనలు, సమస్యలు తన దృష్టిలో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత పరి స్థితుల కారణంగా మత్స్యకార కుటుంబాలు ఎ దుర్కొంటున్న కష్టాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోగలనన్నారు. ప్రస్తుతం శాసనసభ సమావేశాల కారణంగా వ్యక్తిగతంగా వచ్చి మత్స్యకారులతో చర్చించలేకపోతున్నాను. సమ స్యల పరిష్కారానికి గత 2 రోజుల నుంచీ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులతో చర్చిస్తున్నానన్నారు. మత్స్యకారులు ప్రస్తావించిన ప్రతీ సమస్యను పరిగణనలోకి తీసుకుని పరిష్కార మార్గాలు అన్వేషించాలని అఽఽధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమలు, ఫిషరీస్, రెవెన్యూ ఉన్న తాధికారులు, కాకినాడ జిల్లా కలెక్టర్‌తో కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ఆయా కమిటీల్లో మత్స్యకార ప్రతినిధులు, స్థానిక నాయకులకు స్థానం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. సమ స్యల పరిష్కారంతో పాటు జీవనోపాధి మెరుగు దల, తీరప్రాంత గ్రామాల్లో మౌలిక సదుపా యాల కల్పనపైన ఈ కమిటీ దృష్టి పెడుతుం దన్నారు. నష్టపరిహారం మదింపుపై ఈ కమిటీ చర్చిస్తుందని, ఆయా నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొంటుందని పవన పేర్కొన్నారు. ఇప్పటికే వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన సమస్యలను గుర్తించామన్నారు. మరణించిన 18 మంది మత్స్యకారులకు సంబంధించిన కుటుం బాలకు చెల్లించాల్సిన బీమా మొత్తం చెల్లింపు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ దగ్గర దెబ్బతిన్న పడవ లకు నష్టపరిహారం చెల్లింపు అంశాలపై ఆధికా రులతో చర్చించినట్టు తెలిపారు. దానిపై తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. మచిలీపట్నం, అంతర్వేది తదితర ప్రాంతాల్లో మత్స్యకారులకు వేటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేసినట్టు తెలిపారు. ఆ అంశాలపై కమిటీ నివే దిక కోసం ఎదురు చూడకకుండా ప్రాధాన్యంతో పరిష్కరించాలని తెలిపానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కష్టజీవులకు భరోసా కల్పిస్తుందన్నారు. ఈ క్రమంలోనే ఉప్పాడ మత్స్యకారుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తా మన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత స్వయంగా ఉప్పాడ వచ్చి మత్స్యకారుల తో కూర్చోని అన్ని సమస్యలను సమగ్రంగా చర్చిస్తానని పవన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.