Share News

ఉప్పాడ తీరం.. కల్లోలం!

ABN , Publish Date - Aug 27 , 2025 | 01:06 AM

కొత్తపల్లి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై చూపు తోంది. వాతావరణంలో ఏర్పడిన మార్పు లతో తీరం కల్లోలంగా మారి కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ-కాకినాడ బీచ్‌రోడ్డును తాకుతున్నాయి. దీంతో కొత్తపట్నం-

ఉప్పాడ తీరం.. కల్లోలం!
కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో ఎగసిపడుతున్న కెరటాలు

ఎగసిపడుతున్న కెరటాలు

వేట విరమించిన మత్స్యకారులు

కొత్తపల్లి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ తీరంపై చూపు తోంది. వాతావరణంలో ఏర్పడిన మార్పు లతో తీరం కల్లోలంగా మారి కెరటాలు ఎగసిపడుతున్నాయి. ఉప్పాడ-కాకినాడ బీచ్‌రోడ్డును తాకుతున్నాయి. దీంతో కొత్తపట్నం- సుబ్బం పేట మధ్య బీచ్‌రోడ్డు కోతకు గురవడంతో వాహనాల రాక పోకలకు అంతరాయం ఏర్పడు తుంది. బీచ్‌రోడ్డుకు రక్షణగా ఏర్పాటుచేసిన రాళ్లు కెరటాల ధాటికి సముద్రంలో కొట్టుకుపోతున్నాయి. మయాప ట్నం, సూరాడపేట మత్స్యకార ప్రాంతాల్లో కెరటాలు ఇళ్ల ముంగిట్లోకి దూసుకుపోతున్నాయి. మత్స్యకార కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నా రు. కెరటాల తీవ్రత అధికంగా ఉండడంతో ఉప్పాడ నుంచి కాకినాడ వాహనాలపై వెళ్లే వారుఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి సముద్రం మరింత ఉధృ తంగా మారే పరిస్థితి ఉండటంతో జిల్లా ఉన్నతాధి కారుల ఆదేశాల మేరకు కొత్తపల్లి ఎస్‌ఐ జి.వెంక టేష్‌ సిబ్బందితో బీచ్‌రోడ్డులో వాహ నాల రాక పోకలను నియం త్రించే చర్యలు చేపట్టారు. కాగా అల్పపీడన ప్రభా వంతో తీరప్రాం తాల కు చెందిన మత్స్యకా రులు స్వచ్ఛందగా వేట విరమించారు.

Updated Date - Aug 27 , 2025 | 01:06 AM