ఐక్యతకు ప్రతీకలు
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:26 AM
కార్తీక మాసం సందర్భంగా ఆదివారం వనసమారాధనలు ఉత్సాహంగా సాగాయి. పలు సామాజిక వర్గాల వారు జోరుగా హుషారుగా వనసమారాధనలలో పాల్గొన్నారు. లాలాచెరువు సమీపంలోని గోదావరి మహా పుష్కరవనంలో బ్రాహ్మాణ ఉద్యోగుల సేవా సమూహం (బెస్ట్) వనసమారాధన నాయకులు కాశీవఝల శ్రీనివాస్, కేఎన్‌బీ లక్ష్మి, మాంథాత రామకృష్ణ, కంభంపాటి రామగణేష్, వక్కలంక త్రినాథకుమార్ నాయకత్వంలో జరిగింది.
ఘనంగా వనసమారాధనలు
ఉత్సాహంగా పాల్గొన్న చిన్నాపెద్ద
సాంస్కృతిక కార్యక్రమాలు.. పోటీలు
విజేతలకు బహుమతులు
దివాన్‌చెరువు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం సందర్భంగా ఆదివారం వనసమారాధనలు ఉత్సాహంగా సాగాయి. పలు సామాజిక వర్గాల వారు జోరుగా హుషారుగా వనసమారాధనలలో పాల్గొన్నారు. లాలాచెరువు సమీపంలోని గోదావరి మహా పుష్కరవనంలో బ్రాహ్మాణ ఉద్యోగుల సేవా సమూహం (బెస్ట్) వనసమారాధన నాయకులు కాశీవఝల శ్రీనివాస్, కేఎన్‌బీ లక్ష్మి, మాంథాత రామకృష్ణ, కంభంపాటి రామగణేష్, వక్కలంక త్రినాథకుమార్ నాయకత్వంలో జరిగింది. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ పరస్పరం సహాయ సహకారాలు అందించుకోవాలని కోరారు. ఐసీడీఎస్ రాష్ట్ర అసోసియేషన్ నాయకుడు ధర్మాల శ్రీకాంత్‌రాజు మాట్లాడుతూ బెస్ట్ సమూహం ఉద్యోగ మిత్రులను నమోదు చేసుకుని తరచుగా సమావేశాలు నిర్వహించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అలాగే గౌతమీ ఘాట్ వాకర్స్, యోగా వెల్ఫేర్ అసోసియేషన్ వనసమారాధన నిర్వహించుకుంది. ఈ వన భోజనాలకు వచ్చిన జనంతో పుష్కరవనం సందడిగా మారింది. అలాగే దివాన్‌చెరువు-శ్రీరాంపురం మధ్య తోటల్లో జరిగిన కాపునాడు కార్తీక వనసమారాధనకు హాజరైన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ యువత విద్య, ఉపాధి రంగాల్లో అభివృద్ధి చెందాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, అనుశ్రీ సత్యనారాయణ, యర్రా వేణుగోపాలరాయుడు, బార్లపూడి క్రాంతి, మజ్జి పద్మ, జక్కంపూడి విజయలక్ష్మి, ఆకుల వీర్రాజు, మేడపాటి షర్మిలారెడ్డి హాజరయ్యారు. వారిని కాపునాడు జోన్-2 అధ్యక్షుడు గుదే రఘునరేష్, ముమ్మిడి వీరబాబు, దేశినీడి రాంబాబు, కాళ్ల చక్రరావు, రుద్రప్రసాద్, ర్యాలి రామకృష్ణ, పిల్లా ప్రసాద్, గోపిశెట్టి విజయలక్ష్మి, దుర్గాదేవి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పిల్లలకు, పెద్దలకు వివిధ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.