Share News

బీచ్‌ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు

ABN , Publish Date - Sep 17 , 2025 | 12:44 AM

కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సమీపంలో కొత్తపట్నం వద్ద అలల ధాటికి కోతకు గురైన రక్షణ గట్టుకు, బీచ్‌ రోడ్డుకు తా త్కాలిక మరమ్మతులు చేపట్టారు.

బీచ్‌ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు
కొత్తపట్నం వద్ద మరమ్మతులు చేస్తున్న దృశ్యం

కొత్తపల్లి, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఉప్పాడ సమీపంలో కొత్తపట్నం వద్ద అలల ధాటికి కోతకు గురైన రక్షణ గట్టుకు, బీచ్‌ రోడ్డుకు తా త్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇటీవల బం గాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొత్తపట్నం వద్ద బీచ్‌రోడ్డుకు రక్షణగా గతంలో ఏర్పాటుచేసిన బండరాళ్లు, బీచ్‌రోడ్డు కోతకు గురవడం విఽఽధితమే. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద సైజు బండరాళ్లను కొత్తపట్నం తరలించి తాత్కాలికంగా కోత నివారణకు చర్యలు చేపట్టారు. అలాగే కొత్తపట్నం, సుబ్బంపేట వద్ద రోడ్డుకు ఏర్పడిన గుంతలను పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టారు.

Updated Date - Sep 17 , 2025 | 12:44 AM