Share News

ఆటోలు, బస్సుల్లో మహిళలే టార్గెట్‌

ABN , Publish Date - Sep 09 , 2025 | 12:58 AM

అన్నవరం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆటోలు, బస్సుల్లో ప్రయాణించే మహిళలే వారి టార్గెట్‌. వారితో ప్రయాణిస్తూ మాటలతో ఒకరు దృష్టి మరల్చుతారు మరొకరు చాకచాక్యంగా బ్యా గుల్లో విలువైన వస్తువులు, నగదు తస్కరిస్తారు. అలా చోరీలు చేస్తున్న ఇద్దరు మహిళలు అన్న వరం పోలీసులకు చి

ఆటోలు, బస్సుల్లో మహిళలే టార్గెట్‌
అన్నవరంలో వివరాలు వెల్లడిస్తున్న ప్రత్తిపాడు సీఐ

చోరీలకు పాల్పడుతున్న ఇద్దరి మహిళల అరెస్ట్‌

రూ.2 లక్షల నగదు, 106.5 గ్రాముల బంగారం స్వాధీనం

అన్నవరం, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఆటోలు, బస్సుల్లో ప్రయాణించే మహిళలే వారి టార్గెట్‌. వారితో ప్రయాణిస్తూ మాటలతో ఒకరు దృష్టి మరల్చుతారు మరొకరు చాకచాక్యంగా బ్యా గుల్లో విలువైన వస్తువులు, నగదు తస్కరిస్తారు. అలా చోరీలు చేస్తున్న ఇద్దరు మహిళలు అన్న వరం పోలీసులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే తూర్పుగోదావరి జిల్లా గోకవరానికి చెందిన తొం డ శాంతి (35), ఆవుల భూలక్ష్మి (38) తోడుదొంగలు. మహిళా ప్రయాణికులే టార్గెట్‌గా అన్న వరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం, రౌతులపూడి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోరీలు చేశారు. 4 కేసుల్లో నిందితులుగా ఉన్న వారి కోసం పోలీసులు 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా అన్నవరం ఎస్‌ఐ హరిబాబుకు వచ్చిన సమాచారం మేరకు వారిని శంఖవరం కత్తిపూడిలో పట్టుకున్నట్టు ప్ర త్తిపాడు సీఐ సూర్యఅప్పారావు తెలిపారు. వారి నుంచి రూ.2 లక్షల నగదు, 106.5 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన నేపథ్యంలో మహిళలు ప్రయాణంలో అప్రమత్తతో ఉండాలని కోరారు.

Updated Date - Sep 09 , 2025 | 12:58 AM