Share News

చీటీల పేరుతో రూ.2.39 కోట్లు మోసం

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:57 AM

పిఠాపురం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): చీటీల పేరుతో ఖాతాదారులను కోట్లల్లో మోసం చేసిన ఇద్దరు నిందితులను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌, పట్టణ ఎస్‌ఐ మణికుమార్‌ వెల్లడించారు. కాకి నాడ జిల్లా పిఠాపు

చీటీల పేరుతో రూ.2.39 కోట్లు మోసం
నిందితుల అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు

పిఠాపురంలో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

పిఠాపురం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): చీటీల పేరుతో ఖాతాదారులను కోట్లల్లో మోసం చేసిన ఇద్దరు నిందితులను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో పిఠాపురం సీఐ జి.శ్రీనివాస్‌, పట్టణ ఎస్‌ఐ మణికుమార్‌ వెల్లడించారు. కాకి నాడ జిల్లా పిఠాపురంలో 2014లో సత్యశివానీ చిట్‌ఫండ్‌ కంపెనీని కొర్రా సత్యనారాయణ, పక్కుర్తి వరహాలరావు, లోకారెడ్డి భాస్కరరావులను డైరెక్టర్లుగా ప్రారంభించారు. రూ.5 లక్షలు నుంచి రూ.20లక్షల వరకూ చీటీలు వేశారు. 2023లో చీటీలు పాడుకున్న ఖాతాదారులకు సొమ్ములు చెల్లించకపోవడంతో సుమారు 94మంది ఆసిస్టెంట్‌ జిల్లా రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ అనంతరం ఖాతాదారులను మోసం చేసినట్లు వెల్లడి కావడంతో ఆసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ సునంత పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సత్యశివానీ చిట్‌ఫండ్స్‌ రికార్డులు, ఖాతాదారులు వివరాలు, ఇతర ఆధారాలను పిఠాపురం సీఐ ఆధ్వర్యంలో పరిశీలించారు. 94మంది ఖాతాదారులకు సంబంధిం చి రూ.2.39 కోట్లను చెల్లించకుండా చిట్‌ఫండ్‌ కంపెనీ డైరెక్టర్లు పక్కదోవపట్టించి సొంత అవసరాలకు వినియోగించినట్టు విచారణలో వెల్లడైం ది. విచారణ అనంతరం కంపెనీ డైరెక్టర్లు పిఠాపురం మంగాయామ్మరావుపేటకు చెందిన కొర్రా సత్యనారాయణరావు, గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన లోకారెడ్డి భాస్కరరావును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించినట్టు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కేసు లో మరికొందర్ని అరెస్టు చేయాల్సి ఉందన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:57 AM