బుల్లెట్‌పై వచ్చి.. పోలీసులమని బెదిరించి..
ABN , Publish Date - May 28 , 2025 | 01:14 AM
రాజమహేంద్రవరం, మే 27 (ఆంధ్రజ్యోతి): హైవేపై బుల్లెట్ వేసుకుని వస్తారు.. వాహ నాలకు అడ్డంగా నిలిపి పోలీసులమని బెదిరి స్తారు.. సొమ్మును దోచుకుని ఉడాయిస్తారు... తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులు ప్రత్యేక నిఘాతో ఈ దొంగ పోలీసుల ఆట కట్టించారు. ఈ మేర
దారి దోపిడీ చేసిన ఇద్దరు
అరెస్ట్ చేసిన బొమ్మూరు పోలీసులు
రాజమహేంద్రవరం, మే 27 (ఆంధ్రజ్యోతి): హైవేపై బుల్లెట్ వేసుకుని వస్తారు.. వాహ నాలకు అడ్డంగా నిలిపి పోలీసులమని బెదిరి స్తారు.. సొమ్మును దోచుకుని ఉడాయిస్తారు... తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు పోలీసులు ప్రత్యేక నిఘాతో ఈ దొంగ పోలీసుల ఆట కట్టించారు. ఈ మేరకు ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య వివరాలను వెల్లడించారు. ఈనెల 25న అర్ధరాత్రి 12గంటల ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువు హైవే సమీపంలో బుల్లెట్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి తన బొలెరో వాహనాన్ని అటకాయించారని, తాము పోలీసులమంటూ కత్తితో బెదిరించి రూ.వెయ్యి దోచుకుపోయారని విజయనగరం జిల్లా పెదమానాపురానికి చెందిన కూరాడ శివరాజు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి డీఎస్పీ స్వీయ పర్యవేక్షణలో సీఐ కాశీవిశ్వనాథం ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా రాజవోలు ఏఎంజీ స్కూల్ ప్రాంతానికి చెందిన సిర్ర జాస్పర్ ప్రిన్స్, మామిడికుదురు మండలం ఆదూరుకు చెందిన గుడిసె రాబిన్‌లను నిందితులుగా గుర్తించి పాల చర్ల రోడ్డులో మంగళవారం ఉదయం అదుపు లోకి తీసుకున్నామని డీఎస్పీ వివరించారు. బుల్లె ట్, ఫోల్డింగ్ బటన్ చాకు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీళ్లపై గతంలో కూడా దారి దోపిడీ, గంజాయి కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఉన్నాయని ఆమె తెలిపారు. కేసులో ప్రతిభ చూపిన సీఐ కాశీ విశ్వనాథం, ఎస్‌ఐ మురళీ మోహన్ తదితరులను ఎస్పీ నర సింహ కిషోర్, డీఎస్పీ విద్య అభినందించారు.