ఇదేమి ‘పని’తనం!
ABN , Publish Date - May 25 , 2025 | 12:47 AM
కాకినాడ క్రైం, మే 24 (ఆంధ్రజ్యోతి): నమ్మకంగా ఓ ఇంట్లో పని చేస్తూ యజమానురాలు లేని సమయంలో ఆ ఇంటిని కొల్లగొట్టిన పని మనిషి కాకినాడ టూటౌన్ పోలీసులకు దొరికి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయి... కాకినాడ విద్యుత్‌నగర్ ఎస్‌బీఐ కాలనీలో నివసిస్తున్న వి.మణి కలెక్టరేట్ ప్రాంగణంలో
పనిచేస్తున్న ఇళ్లకే
కన్నం వేసిన పని మనుషులు
కాకినాడలో మహిళ అరెస్ట్
22 కాసుల బంగారు ఆభరణాలు,
వెండి వస్తువుల స్వాధీనం
సామర్లకోటలో రూ.6 లక్షల విలువైన
బంగారు ఆభరణాలతో మహిళ అరెస్ట్
కాకినాడ క్రైం, మే 24 (ఆంధ్రజ్యోతి): నమ్మకంగా ఓ ఇంట్లో పని చేస్తూ యజమానురాలు లేని సమయంలో ఆ ఇంటిని కొల్లగొట్టిన పని మనిషి కాకినాడ టూటౌన్ పోలీసులకు దొరికి పోయింది. వివరాలు ఇలా ఉన్నాయి... కాకినాడ విద్యుత్‌నగర్ ఎస్‌బీఐ కాలనీలో నివసిస్తున్న వి.మణి కలెక్టరేట్ ప్రాంగణంలోని వికాస సంస ్థలో మేనేజర్‌గా పనిచేస్తోంది. ఆమె శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఇంటికి తాళం వేసి విధులకు హాజరై సాయం త్రం 5.30 గంట లకు వచ్చింది. బీరువాలో ఉన్న 22 కాసుల బంగారు ఆభరణాలు, ఇతర వెండి వస్తువులు చోరీకి గురైనట్టు గుర్తించి వెంటనే టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. టూటౌన్ సీఐ మజ్జి అప్పలనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా మణి ఆఫీసుకు వెళ్లేటప్పుడు ఒకచోట తాళం పెట్టి వెళ్తుంది. ఇది తెలిసిన పని మనిషి రమ్య యజ మాని వెళ్లగానే ఆ తాళం తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో ఉన్న బంగా రు ఆభరణాలు, వెండి వస్తువులను తీసుకుని ఉడాయించింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు రమ్యను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తానే ఆభరణాలను దొంగిలించినట్టు ఒప్పుకోవడంతో వాటిని స్వాధీనం చేసుకుని మణికి అప్పగించారు. కేసును చేధించిన సీఐ అప్పలనాయుడు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
సామర్లకోటలో....
సామర్లకోట, మే 24 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా సామర్లకోటలో సింగవరపు సత్యనారాయ ణ ఇంటిలో ఇటీవల జరిగిన చోరీ సంఘటనలో సామర్లకోట పోలీసులు దర్యాప్తు మేరకు ఇంటి లో పనిచేస్తున్న వీర్రాఘవపురానికి చెందిన బొ డ్డు దుర్గాదేవిని విచారించగా చోరీకి గురైన రూ. 6 లక్షల విలువైన బంగారపు ఆభరణాలు, 17 చిన్న డైమండ్స్, స్మార్ట్ వాచ్‌ను స్వాధీనం చేసుకున్నట్టు శనివారం రాత్రి సీఐ కృష్ణభగవాన్ విలేకర్లకు తెలిపారు. అంబటి వారి తోటలోని సత్యనారాయణ ఇంటిలో జరిగిన ఈ చోరీపై సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. ఇంటిలోనే పనిమనిషిగా పని చేస్తున్న దుర్గాదేవిని అనుమానించి పోలీసులు తమదైన కోణంలో దర్యాప్తు నిర్వహిం చడంతో తానే చోరీకి పాల్పడినట్లు అంగీకరించడమే గాక ఆమె ఇంటిలో దాచి ఉంచిన ఆభరణాలు తదిత ర చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. కాగా దుర్గాదేవిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టు ఎదుట హాజరుపర్చనున్నట్టు సీఐ తెలిపారు. ప్రతీ ఇంటి యజమా నులు ఇల్లు విడిచి వేరే ప్రాంతాలకు వెళ్లినపుడు ఎల్‌హెచ్‌ఎంఎస్ తప్పనిసరిగా వాడాలని సూచించారు. అలాగే ఇంటిలో పనిమనుషులను పెట్టుకున్న ప్పుడు వారి కదలికలపై నిఘా ఉంచాలని తెలిపారు.