Share News

పుల్లల కోసం వెళ్లి.. పుట్టెడు శోకం మిగిల్చి..

ABN , Publish Date - Sep 03 , 2025 | 01:53 AM

ఏలేశ్వరం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు కాలువలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారు వరుసకు వదిన, ఆడపడుచు అవుతారు. స్థానికులు, పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మందుల కాలనీకి చెందిన పెండ్ర లక్ష్మి (38),

పుల్లల కోసం వెళ్లి.. పుట్టెడు శోకం మిగిల్చి..
రోదిస్తున్న పెండ్ర లక్ష్మి కుటుంబసభ్యులు

ఏలేరు కాలువలో ఇద్దరి మృతి

కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఘటన

ఏలేశ్వరం, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు కాలువలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయినవారు వరుసకు వదిన, ఆడపడుచు అవుతారు. స్థానికులు, పోలీసులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మందుల కాలనీకి చెందిన పెండ్ర లక్ష్మి (38), పొరుగున ఉన్న పెండ్ర కుమారి (13)తో మంగళవారం పుల్లల కోసం ఏలేరు కాలువ గట్టుకు వెళ్లారు. మంచినీళ్లు తాగేందుకు వెళిన్ల కుమారి కాలువలో మునిగిపోతున్న విషయాన్ని లక్ష్మి గమనించి కాపాడేందుకు వెళ్లింది. ఈక్రమంలో ఇద్దరు కాలువలో గల్లంతయ్యారు. కాలువ వద్దనే దుస్తులు ఉతుకుతున్న కొందరు సమాచారాన్ని కాలనీవాసులు, పోలీసులకు తెలిపారు. వారు సంఘటనా స్థలానికి వచ్చి గత ఈతగాళ్లతో గాలించగా రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ ఇద్దరు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ రామలింగేఽశ్వరరావు పరిశీలించి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

రెండూ పేద కుటుంబాలే..

పెండ్ర లక్ష్మి, అప్పన్న పేద కుటుంబానికి చెందిన వారే. అప్పన్న తలవెంట్రుకలకు సా మాన్లు ఇచ్చే వ్యాపారం చేస్తూ భార్య, నలుగురు పిల్లలను పోషిస్తున్నాడు. భార్య గృహిణిగా ఉంటూ కట్టెల కోసం వెళ్లి మృత్యువాత పడింది. భార్య మృతితో పిల్లలకు ఆసరా లేకుండా పోయిందని అప్పన్న విలపిస్తున్నాడు. ఇదే కాలనీకి చెందిన పెండ్ర సత్తిబాబు, అంకమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నా రు. వారిలో రెండో కుమార్తె అయిన కుమారి మరణించండంతో ఇంటి పనుల్లో సహకారంగా ఉండేదని గుర్తుచేసుకుని తలిదండ్రులు రోదిస్తున్నారు. పుల్లల కోసం వెళ్లి మృత్యువాత పడటం కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగిల్చింది.

ఎమ్మెల్యే సత్యప్రభ పరామర్శ

ఏలేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రిలో మృతుల కుటుంబ సభ్యులను ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పరామర్శించారు. బంధువులు, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకుని కుటు ంబ సభ్యులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి న్యాయం చేకూరేలా చర్యలు తీసుకుంటానని ఆమె భరోసా ఇచ్చారు.

Updated Date - Sep 03 , 2025 | 01:53 AM