Share News

కిలేడీలు అన్నవరంలో దొరికారు!

ABN , Publish Date - May 17 , 2025 | 01:35 AM

అన్నవరం, మే 16 (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ కిలేడీలు. దొంగతనానికి నిర్ణయించుకున్నారంటే ఎంతదూరమైనా ప్రయాణిస్తారు. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో ప్రయాణికుల ఆభరణాలు, నగదు తస్కరించడమే లక్ష్యంగా పెట్టుకుని చాకచక్యంగా ప్రయాణికులతో మాటలు కలిపి దృష్టిమరలిచి నగదు, ఆభరణాలు తీసుకుపోతుంటారు. అలాంటి అత్తాకోడళ్లను కాకినాడ జిల్లా అన్నవరంలో పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే విజయవాడ రామవర

కిలేడీలు అన్నవరంలో దొరికారు!
నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలతో ప్రత్తిపాడు సీఐ

బస్సుల్లో ప్రయాణికుల ఆభరణాలు దొంగిలిస్తున్న అత్తాకోడళ్ల అరెస్టు

60 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదు స్వాధీనం

అన్నవరం, మే 16 (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ కిలేడీలు. దొంగతనానికి నిర్ణయించుకున్నారంటే ఎంతదూరమైనా ప్రయాణిస్తారు. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్‌లలో ప్రయాణికుల ఆభరణాలు, నగదు తస్కరించడమే లక్ష్యంగా పెట్టుకుని చాకచక్యంగా ప్రయాణికులతో మాటలు కలిపి దృష్టిమరలిచి నగదు, ఆభరణాలు తీసుకుపోతుంటారు. అలాంటి అత్తాకోడళ్లను కాకినాడ జిల్లా అన్నవరంలో పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే విజయవాడ రామవరప్పాడుకు చెందిన నక్కా వెంకటలక్ష్మి (21), నక్కా మంగ (45) అత్తాకోడళ్లు. వీరు రద్దీగా ఉండే బస్సుల వద్ద ప్రయాణికుల ఆభరణాలు, బ్యాగ్‌లలో నగదుపై కన్నేసి వారితో మాటలు కలిపి దృష్టి మరల్చి తస్కరించి వెంటనే దిగిపోతారు. దీంతో వారిపై నిఘాపెట్టిన పోలీసులు అన్న వరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో అరెస్టు చేసి 60 గ్రాముల బంగారం, రూ.1.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్టు ప్రత్తిపాడు సీఐ సూరి అప్పారావు తెలిపారు. వీరు అన్నవరం, ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసుల్లో నిం దుతులని తెలిపారు. రిమాండ్‌కు ప్రత్తిపాడు కోర్టుకు తరలించామన్నారు. సమావేశంలో అన్నవరం ఎస్‌ఐ హరిబాబు తదితరులున్నారు.

Updated Date - May 17 , 2025 | 01:35 AM