పేదల కడుపు కంది..నది!
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:47 AM
చాలా కాలంగా పేదింటికి కందిపప్పు దూరమైంది..గత వైసీపీ ప్రభు త్వంలో కందిపప్పు సరఫరా నిలిచిపోయింది..ఆ ప్రభు త్వంలో ఇచ్చినా అరకొరగానే ఉండేది.అయితే కూటమి ప్రభుత్వంలో కందిపప్పు తప్పనిసరిగా సరఫరా చేస్తారని అంతా ఆశిం చారు. అయితే అదీ నిరాశగానే మారింది.
4 నెలలుగా అందని కందిపప్పు
ఆగస్టు రేషన్‌లోనూ నిరాశేనా?
ఇంకా ఖరారు కాని టెండర్లు
కలెక్టరేట్(కాకినాడ), జూలై 27(ఆంధ్రజ్యోతి): చాలా కాలంగా పేదింటికి కందిపప్పు దూరమైంది..గత వైసీపీ ప్రభు త్వంలో కందిపప్పు సరఫరా నిలిచిపోయింది..ఆ ప్రభు త్వంలో ఇచ్చినా అరకొరగానే ఉండేది.అయితే కూటమి ప్రభుత్వంలో కందిపప్పు తప్పనిసరిగా సరఫరా చేస్తారని అంతా ఆశిం చారు. అయితే అదీ నిరాశగానే మారింది. ఎందు కంటే గత నాలుగు నెలలుగా రేషన దుకాణాల్లో కందిపప్పు పంపిణీ జరగడం లేదు.ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 15 లక్షల రేషనకార్డులు ఉన్నాయి. కాకినాడ జిల్లాలో 6 లక్షల 54 వేల రేషనకార్డులు ఉన్నాయి. వీరికి నెలకు 300 మెట్రిక్ టన్నులు కందిపప్పు కేటాయించాలి. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా లో 3 లక్షల 75 వేల రేషనకార్డులు ఉన్నాయి.వీరికి 200 మెట్రిక్ టన్నుల కందిపప్పు కేటాయించాలి.తూర్పుగోదావరి జిల్లాలో 5 లక్షల రేషన కార్డులు ఉన్నాయి.వీరికి 300 మెట్రిక్ టన్నులు కావాలి. మొత్తంగా మూడు జిల్లాలకు కలిపి 800 మెట్రిక్ టన్నులు కందిపప్పు పంపిణీ నిమిత్తం ప్రభుత్వం సరఫరా చేయాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత కాలం క్రమం తప్పకుండా కందిపప్పును ప్రజా పంపిణీ వ్యవస్థలో అందజేసింది. కానీ నాలుగు నెలలుగా కం దిపప్పు సరఫరా నిలిచిపోయింది. అమరావతిలో కంది పప్పు టెండర్లు ఖరారు కాకపోవడంవల్ల సరఫరా నిలిచి పోయిందని అధికారులు అంటున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ చౌకధరల దుకాణాలకు ఎప్పుడు సరఫరా అవుతుందో చెప్పలేక పోతు న్నారు. రేషన దుకాణాల్లో కిలో కందిపప్పు రూ.67కే లబ్ధిదా రులకు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కె ట్‌లో కిలో రూ.100 నుంచి రూ.110 వరకు ధర పలుకుతోంది. ఆగస్టులోనైనా పంపిణీ జరుగుతుం దని లబ్ధిదారులు ఆశగా చూస్తు న్నారు. వచ్చే నెలలో కూడా కందిపప్పు సరఫరా అయ్యే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు అంటు న్నారు.గత వైసీపీ ప్రభు త్వంలో ఒక నెల కంది పప్పు ఇస్తే రెండు నెలలు కోత విధించేవారు.కూటమి ప్రభు త్వం వచ్చిన తర్వాత క్రమం తప్పకుండా పంపిణీ చేసినప్పటికీ నాలుగు నెలలుగా కంది పప్పు సరఫరాకావడంలేదు. కాకినాడ జిల్లా సివిల్ సప్లయిస్ కార్పొరేషన మేనేజర్ దేవుల నాయక్‌ను సం ప్రదించగా ఈ నెల కంది పప్పు కేటాయింపులు జరగలేద న్నారు. దీంతో ఆగస్టులో అందే పరిస్థితి కానరావడంలేదు.