Share News

దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Aug 07 , 2025 | 01:23 AM

దేవాలయాల అభివృద్ధికి ఎండోమెంట్‌ కమిటీలు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక తిలక్‌రోడ్‌లోని తన కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమిష్టిగా 2024 ఎన్నికల్లో తన విజయానికి పనిచేశారని, ఆ నాయకులకు, కార్యకర్తలకు సముచితస్థానం కల్పించాలనే ఆలోచనతో నగరంలోని 14 ఎండోమెంట్‌ కమిటీలు వేసేందుకు చర్యలు తీసుకున్నామని, ఇందులో 4 కమిటీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.

దేవాలయాల అభివృద్ధికి కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే వాసు

  • ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు

  • నగరంలో పలు ఎండోమెంట్‌ కమిటీలకు చైర్మన్ల ప్రకటన

రాజమహేంద్రవరంసిటీ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): దేవాలయాల అభివృద్ధికి ఎండోమెంట్‌ కమిటీలు కృషి చేయాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక తిలక్‌రోడ్‌లోని తన కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు సమిష్టిగా 2024 ఎన్నికల్లో తన విజయానికి పనిచేశారని, ఆ నాయకులకు, కార్యకర్తలకు సముచితస్థానం కల్పించాలనే ఆలోచనతో నగరంలోని 14 ఎండోమెంట్‌ కమిటీలు వేసేందుకు చర్యలు తీసుకున్నామని, ఇందులో 4 కమిటీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. ఈ సందర్భంగా కమిటీల చైర్మన్ల వివరాలను వెల్లడించారు. నాళం భీమరాజు వీధిలోని శ్రీవిఘ్నేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా ఎంఎన్‌పీవీ సత్యనారాయణ, సారంగదారేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా కేవీడీఎస్‌వీ చౌదరి, నేషనల్‌ సీనియర్‌ బేసిక్‌ స్కూల్‌ కమిటీ చైర్మన్‌గా చింతా జోగినాయుడు, కో రుకొండ రోడ్డులోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా వైవీవీ దుర్గాప్రసాద్‌ నియమితులయ్యారని తెలిపారు. అలాగే శ్రీఉమామార్కండేయస్వామి దేవస్థానం చైర్మన్‌గా మదన్‌సింగ్‌ రాజ్‌పురోహిత్‌, శ్రీశ్యామలాంబ దేవస్థానం చైర్మన్‌గా కడియాల వీరభద్రరావు, శ్రీపందిరి మహదేవుడు సత్రం చైర్మన్‌గా రెడ్డి మణీశ్వరరావు, జాంపేట శ్రీఉమారామలింగేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్‌గా దాసరి గురునాధరావు నియమితులయ్యారన్నారు. అతిత్వరలో ఈ కమిటీలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తాయని స్పష్టం చే శారు. ఈ కమిటీల పదవీకాల పరిమితి రెండేళ్లు ఉంటుందని, అటుపై మరో రెండేళ్లకు కొత్తవారికి అవకాశం ఇస్తామన్నారు.

  • వైసీపీ వారితో జైలు నిండిపోయేది!

గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే ఈ ఏడాది కాలంలో రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు వైసీపీ వారితో నిండి పోయి ఉం డేదని ఎమ్మెల్యే వాసు అన్నారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సఖ్యతతో ఉన్నారని, వైసీపీ గ్రౌండ్‌స్థాయిలో జీరో అయిపోయిందని చెప్పారు. త్వరలో కార్పొరేషన్‌ ఎన్నికలు జరిపిస్తామన్నారు. టిడ్కో గృహాలు కూడా లబ్దిదారులకు అందజేస్తామన్నారు. ఈ నెలాఖరుకు 5,500 కొత్త రేషన్‌కా ర్డులు జారీ చేస్తామని, త్వరలో 9,600 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. సమావేశంలో కూటమి నాయకులు కాశి నవీన్‌కుమార్‌, మజ్జి రాంబాబు, వై శ్రీను, దొండపాటి సత్యంబాబు, బుడ్డిగ రాధ, ఉప్పులూరి జానకిరామయ్య, బుడ్డిగ రవి, జి.నాగేంద్ర, కంటిపూడి శ్రీనువాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 01:23 AM