గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి
ABN , Publish Date - Aug 30 , 2025 | 01:00 AM
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మార్కెట్ కమిటీ కృషి చేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ మార్ని వాసు అధ్యక్షత నిర్వహించిన మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల
రాజమహేంద్రవరం అర్బన్, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా మార్కెట్ కమిటీ కృషి చేయాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ మార్ని వాసు అధ్యక్షత నిర్వహించిన మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశానికి ఆయన విచ్చేసి మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో మార్కెట్ యార్డులో దళారీ వ్యవస్థ రాజ్యమేలిందని, రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు, ప్రకృతి వ్యవసాయం, బీమా వంటివి కల్పించడానికి కృషి చేస్తున్నామని, మోడల్ మార్కెట్ యార్డుగా తీర్చిదిద్దుతామని అన్నారు. చైర్మన్ వాసు మాట్లాడుతూ రూ.1.50 కోట్లతో ధవళేశ్వరం, వడ్డెరపేటల్లో రైతుబజార్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ సమావేశంలో 333.70 లక్షలతో 50 కొత్త షాపులు, టాయిలెట్లు, పార్కింగ్ షెడ్లు, ఆఫీస్ మరమ్మతులు వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నిధులు మంజూరుకు మార్కెటింగ్ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించారు. జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.సునీల్‌వినయ్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ బోడపాటి గోపి, రైతు నాయకులు మార్గాని సత్యనారాయణ, సెక్రటరీ వినుకొండ ఆంజనేయులు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.