్డ్డట్రాఫిక్ టెర్రర్
ABN , Publish Date - Nov 23 , 2025 | 01:34 AM
జిల్లాలో ట్రాఫిక్ పూర్తిగా నియంత్రణ కోల్పోయి తలపోటుగా మారింది. ప్రభుత్వశాఖల జిల్లా బాస్ లు నిత్యం సంచరించే జిల్లా కేంద్రమైన రాజమ హేంద్రవరంలో మరీ అస్తవ్యస్తంగా తయారైంది.
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ట్రాఫిక్ పూర్తిగా నియంత్రణ కోల్పోయి తలపోటుగా మారింది. ప్రభుత్వశాఖల జిల్లా బాస్ లు నిత్యం సంచరించే జిల్లా కేంద్రమైన రాజమ హేంద్రవరంలో మరీ అస్తవ్యస్తంగా తయారైంది. జిల్లాలోని అధికశాతం కూడళ్లలో, ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో అసలు ట్రాఫిక్ సిగ్నల్సే లేవు. ఒకవేళ ఉన్నా వాటి నిర్వహణ దైవాధీనంగా ఉంది. నిడదవోలు, కొవ్వూరు తదితర ప్రాంతాల్లో సిగ్నల్స్ ఊసేలేదు. సాక్షాత్తూ కలెక్టర్, ఎస్పీ, ముని సిపల్ కమిషనర్, విద్యుత్తు ఎస్‌ఈ రోజూ తిరిగే జిల్లా కేంద్రంలో కూడా సిగ్నల్స్ డిస్కోలైట్లను తల పిస్తున్నాయి. ప్రజాప్రతినిధులు ఇదే రోడ్లపై సంచ రిస్తున్నా వారికి ఈ సమస్య కనబడడం లేదు. రాజ మహేంద్రవరంలోని ముఖ్య కూడళ్లయిన కంబాల చెరువు, ఐటీ ఆఫీస్, లాలాచెరువు, డీటీసీ జంక్షన్, శ్యామలా సెంటర్, వీఎల్ పురం జంక్షన్, జాంపేట, దేవీచౌక్, గోకవరం బస్టాండ్, కోటిపల్లి బస్టాండ్, తాడితోట, వీఎల్‌పురం జంక్షన్లలో సిగ్నల్స్ ఉన్నా అవి ఎప్పుడు మెలకువగా ఉంటాయో వాటికే తెలి యడం లేదు. ఒక్కోసారి వెలిగినా ఓ అంకె కనబడి తే మరో అంకె దాక్కుంటుంది. అడ్డంగా గీతలు వస్తుంటాయి. ఇక పార్కింగ్ ప్రదేశాలంటూ నిర్దేశిం చక పోవడంతో ఇష్టానుసారం వాహనాలను నిలిపే యడం పరిపాటిగా మారింది. సిగ్నల్స్ నిర్వహణ బాధ్యత రాజమహేంద్రవరంలో మునిసిపల్ కార్పొ రేషన్‌లోని పట్టణ ప్రణాళికా విభాగం చూసుకుం టుంది. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసుకోవడం వరకూ బాగానే ఉన్నా.. నిర్వహణ విషయంలో అజ మాయిషీ అంతంత మాత్రంగా ఉండడంపై విమర్శ లు వినవస్తున్నాయి. మొత్తానికి ఒకరిపై ఒకరు నెపం నెట్టేసుకుంటూ ట్రాఫిక్‌ని మరింత జఠిలం చేస్తున్నారనే విమర్శలున్నాయి. సాక్షాత్తూ జిల్లా పోలీసు కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న టీడీసీ జంక్షన్‌లో కూడా వాహనదారులతో సిగ్నల్స్ ఆటలాడుకుంటూ ఉంటాయి. ఇక్కడ పోలీసులు తమ ఇష్టానుసారం బారికేడింగ్‌ల ను మారుస్తూ ఉంటారు. ఈ జంక్షన్‌ని ఇప్ప టికే బ్లాక్‌స్పాట్‌గా గుర్తించినా కనీసం ట్రాఫిక్ సిగ్నల్స్‌ని సక్రమంగా పనిచేయించలేని దుస్థితి నెలకొంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళ ల్లో వాహనదారులు నరకం చూస్తున్నారు.
ఫ గత ప్రభుత్వంలో..
గతంకంటే ట్రాఫిక్ విపరీతంగా పెరిగిన మాట వాస్తవమే. జిల్లా కేంద్రమైన తర్వాత రాజమహేంద్రవరంలో ఈ సమస్య మరీ ఎక్కు వైంది. ఎక్కడైనా ట్రాఫిక్ పెరిగితే ఇబ్బందులు అధిగమించడానికి రోడ్లు, కూడళ్లు వెడల్పు చేస్తారు. కానీ, జిల్లాలో అందుకు భిన్నంగా గత వైసీపీ హయాంలో అభివృద్ధి పేరుతో రోడ్లు, జంక్షన్లను కుచించుకుపోయేలా చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పెరిగిపోయాయి. వాటికి అస్తవ్యస్త సిగ్నల్స్ నిర్వహణ మరింత ఆజ్యం పోస్తోంది. ఉదాహరణకు రాజమహేంద్రవరం లో కంబాలచెరువు, ఐటీ ఆఫీస్ ఏరియాల్లో జం క్షన్ డవలప్‌మెంట్ పేరుతో చేసిన పనుల వల్ల వాహనదారుల ఇబ్బందులు మరింత ఎక్కువ య్యాయి. వీటిని తొలగిస్తామని ఎమ్మెల్యే ఆది రెడ్డి వాసు ప్రకటించినా.. మిగతా సమస్యల సంగతేంటని జనం ప్రశ్నిస్తున్నారు. కంబాల చెరువు నుంచి లాలాచెరువు వరకూ ఫుట్‌పా త్‌లపై బిళ్లలు అతికించి పూల కుండీలు ఏర్పా టు చేశారు. దీంతో చిరువ్యాపారులు రోడ్డుపైకి రాక తప్పలేదు. అసలే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఈ రహదారి ప్రమాదకరంగా మారింది. జాంపేట ఆజాద్ చౌక్‌లో ఆర్టీసీ బస్సులు మలుపు తిరగడానికి నానాకష్టాలూ పడాల్సి వస్తోంది. ఈ ప్రదేశం ట్రాఫిక్ డీఎస్పీ కార్యా లయానికి సమీపంలోనే ఉండడం గమనార్హం.
ఫ ట్రాఫిక్ సలహా కమిటీ ఏమైంది..
సాధారణంగా నగరంలో లేదా పట్టణాల్లో ట్రాఫిక్ నియంత్రించడానికి ట్రాఫిక్ సలహా కమిటీ ఉంటుంది. దీనిలో మునిసిపాలిటీ, పోలీస్, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, విద్యుత్, నేషనల్ హైవేస్ తదితర శాఖలతోపాటు వ్యాపారులు ఉంటారు. ట్రాఫిక్ సమస్యలపై తాత్కాలిక చర్యలను మాత్రమే ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటారు. శాశ్వతమైన నిర్ణయాలను కమిటీ తీసుకుంటుంది. అయితే అసలు ట్రాఫిక్ సలహా కమిటీలు ఉన్నాయా? అంటే సమాధా నం ముఖం చాటేస్తోంది. ట్రాఫిక్ నియంత్ర ణపై తగిన విధంగా ఏర్పాట్లు లేకపోవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో ట్రాఫిక్ విభాగానికి ఒకే సీఐ ఉన్నా రు. మరో పోస్టును చాన్నాళ్లుగా భర్తీ చేయడం లేదు. సిబ్బంది కొరత ఉండనే ఉంది.