Share News

ఎటెల్లాలి!

ABN , Publish Date - Sep 27 , 2025 | 12:46 AM

జిల్లాలో ట్రాఫిక్‌ తలపోటుగా మారింది. శాఖ ల సమన్వయ లోపం, ట్రాఫిక్‌ పోలీసుల కొరత తో జిల్లా కేంద్రంలో నియంత్రణ కోల్పోయింది.

ఎటెల్లాలి!

నగరంలో తప్పని ట్రాఫిక్‌ ఇక్కట్లు

బయటకెళితే చింతే

ఎక్కడా పనిచేయని సిగ్నల్స్‌

జంక్షన్లలో తప్పని టెన్షన్‌

పెరుగుతున్న ప్రమాదాలు

భయపడుతున్న వాహనదారులు

మరో వైపు ట్రాఫిక్‌ పోలీసుల కొరత

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ట్రాఫిక్‌ తలపోటుగా మారింది. శాఖ ల సమన్వయ లోపం, ట్రాఫిక్‌ పోలీసుల కొరత తో జిల్లా కేంద్రంలో నియంత్రణ కోల్పోయింది. రాజమహేంద్రవరంలో మరీ అస్తవ్యస్తంగా మా రింది. ట్రాఫిక్‌ నియంత్రణలో ప్రధాన భూమిక పోషించే జంక్షన్లలో సిగ్నల్స్‌ వెలిగితే సంబరమే. నగరాలు/పట్టణాల్లో దారితప్పిన ట్రాఫిక్‌ వాహ నదారులను విసుగెత్తిస్తోంది. ట్రాఫిక్‌ చిక్కుల నుంచి రాజమహేంద్రవరాన్ని బయటపడే యడం ఓ పెద్ద చిక్కుముడిగా మారింది. ఇప్ప టికైనా అధికారులు, ప్రజాప్రతి నిధులు ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపిం చాల్సిన అవసరత అత్యవసరంగా కనిపిస్తోంది.

సిగ్నల్స్‌ వెలిగితే అదృష్టమే..

జిల్లాలోని అధికశాతం కూడళ్లు, ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాల్లో అసలు ట్రాఫిక్‌ సిగ్నల్సే లేవు. కొవ్వూరు, నిడదవోలు పట్టణాల్లోనూ అదే పరిస్థితి.ఒకవేళ ఉన్నా నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంటోంది. సాక్షాత్తూ కలెక్టర్‌, ఎస్పీ, మునిసిపల్‌ కమిషనర్‌, విద్యుత్‌ ఎస్‌ఈ రోజూ తిరిగే జిల్లా కేంద్రంలో కూడా సిగ్నల్స్‌ వాటి ఇష్టానుసారంగా పనిచేస్తాయి. ప్రజాప్రతినిధులు ఇదే రోడ్లపై సం చరిస్తున్నా వారికి ఈ సమస్య కనబడడం లేదు. రాజమహేంద్రవరంలోని ముఖ్య కూడళ్లయిన కంబాలచెరువు,ఐటీ ఆఫీస్‌, లాలాచెరువు, డీటీసీ జంక్షన్‌, శ్యామలా సెంటర్‌, వీఎల్‌ పురం జం క్షన్‌, జాంపేట, దేవీచౌక్‌, గోకవరం బస్టాండ్‌, కోటిపల్లి బస్టాండ్‌, తాడితోట, వీఎల్‌పురం వద్ద సిగ్నల్స్‌ ఉన్నా ఎక్కువ సమయం నిద్దరోతూనే ఉంటాయి. ఉదాహ రణకు డీటీసీ జంక్షను బ్లాక్‌ స్పాట్‌ లిస్టులో ఉంది.కానీ ఇక్కడ కనీసం లైటిం గ్‌ ఉండదు. సిగ్నల్‌ దోబూచులాట మామూలే.

అభివృద్ధి పేరుతో..

జిల్లా కేంద్రమైన తర్వాత రాజమ హేంద్ర వరంలో గతం కంటే ట్రాఫిక్‌ పెరిగింది.. ఎక్కడైనా ట్రాఫిక్‌ పెరిగితే ఇబ్బందులు అధిగ మించడానికి రోడ్లు, కూడళ్లు వెడల్పు చేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో జిల్లాలో అభివృద్ధి పేరుతో రోడ్లు, జంక్షన్లు కుచించుకుపోయేలా చేశారు. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు పెరిగిపో యాయి. వాటికి అస్తవ్యస్త సిగ్నల్స్‌ నిర్వహణ ఆజ్యం పోస్తోంది. ఉదాహరణకు రాజమహేంద్ర వరంలో కంబాలచెరువు, ఐటీ ఆఫీస్‌ ఏరియాల్లో జంక్షన్ల అభివృద్ధి పేరుతో చేసిన పనుల వల్ల వాహనదారులకు ఇబ్బందులెక్కువయ్యాయి. సాధారణంగా ట్రాఫిక్‌ నియంత్రణకు ట్రాఫిక్‌ సలహా కమిటీ ఉంటుంది. దీనిలో మునిసి పాలిటీ, పోలీస్‌, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, విద్యుత్‌, నేషనల్‌ హైవేస్‌ తదితర శాఖలతో పాటు వ్యా పారులు ఉంటారు. ట్రాఫిక్‌ సమస్యలపై శాశ్వ తమైన నిర్ణయాలను కమిటీ తీసుకుంటుంది. ఆ మేరకు చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమిస్తారు. అయితే,అసలు ట్రా ఫిక్‌ సలహా కమిటీలు ఉన్నా యా? అంటే సమాధానం ముఖం చాటేస్తోంది.

సమన్వయ లోపం

నగరంలో పది కూడళ్లలో విద్యుత్‌, మరో పది జంక్షన్లలో సోలార్‌ సిస్టంతో సిగ్నల్స్‌ పని చేస్తాయి. వీటి నిర్వహణ బాధ్యత మునిసిపల్‌ కార్పొ రేషన్‌లోని పట్టణ ప్రణాళికా విభాగం చూసుకుంటుంది. కాంట్రాక్టర్లతో అగ్రిమెంట్లు చేసుకోవడం వరకూ బాగానే ఉన్నా.. నిర్వహణ లో అజమాయిషీ అంతంత మాత్రంగా ఉండ డంపై విమర్శలు వినవస్తున్నాయి. పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టంలు పడుకునే ఉంటున్నాయి.

ట్రాఫిక్‌ పోలీసుల కొరత..

రాజమహేంద్రవరం నిత్యం రద్దీగానే ఉంటుంది. రోజుకు లక్షల వాహనాలు సంచరిస్తూ ఉంటాయి.కానీ ట్రాఫిక్‌ని నియం త్రించే పోలీసుల కొరత తీవ్రంగా ఉంది. ట్రాఫిక్‌ విభాగానికి డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్‌ఐలు, ఒక సార్జెంట్‌ ఉం డాలి.కానీ చాలా సీట్లు ఖాళీగా ఉన్నాయి. కిందిస్థాయి సిబ్బంది 25 మంది కావాల్సి ఉంది. సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీకి చాలా కాలంగా ట్రాఫిక్‌ బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇటీవల ఉద్యోగ విర మణ పొందారు. ఆ పోస్టును భర్తీ చేయ లేదు. ఇద్దరు సీఐలకు ఒకరు అవినీతి ఆరోపణలపై ఇంటి కెళ్లారు.అప్పటి నుంచీ ఒక సీఐ మాత్రమే చక్కబెడుతున్నారు. ఐదుగురు ఎస్‌ఐలు చేయాల్సిన పనులను ముగ్గురు మోస్తు న్నారు. ట్రాఫిక్‌ నియంత్రణలో క్షేత్రస్థాయిలో కీలక భూమిక పోషించే హోంగార్డులు, కానిస్టేబుల్స్‌ కొరత ఉంది. =

Updated Date - Sep 27 , 2025 | 12:46 AM