ట్రాఫిక్ వలయం
ABN , Publish Date - Dec 08 , 2025 | 12:20 AM
రాజమహేంద్రవరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన దేవిచౌక్ రహదారులు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని కొట్టిమిట్డాతున్నాయి. సాధారణంగా రాజమహేంద్రవరంలో దేవిచౌక్, గోకవరం బస్టాండ్ సెంటర్, ఆజాద్ చౌక్, అప్సర సెంటర్, డీలక్స్ సెంటర్, కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్, తాడితోట, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, దానవాయిపేట పాత సిటీ హాస్పిటల్ సెంటర్, వై-జంక్షన్, క్వారీ సెంటర్, సీతంపేట వాటర్ ట్యాంక్‌ల సెంటర్ల నిత్యం రద్దీగా ఉంటాయి. ట్రాఫిక్ కాస్త అధికంగా ఉంటుంది.
దేవిచౌక్ రహదారుల్లో వాహనాల రద్దీ
లక్ష్మీవారపుపేట దారిలో అధికం
రోడ్డుకు అడ్డంగా పార్కింగ్‌లు
ఇబ్బందుల్లో నగర వాసులు
రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన దేవిచౌక్ రహదారులు ట్రాఫిక్ వలయంలో చిక్కుకుని కొట్టిమిట్డాతున్నాయి. సాధారణంగా రాజమహేంద్రవరంలో దేవిచౌక్, గోకవరం బస్టాండ్ సెంటర్, ఆజాద్ చౌక్, అప్సర సెంటర్, డీలక్స్ సెంటర్, కోటిపల్లి బస్టాండ్, రైల్వే స్టేషన్, తాడితోట, ఆర్టీసీ కాంప్లెక్స్ రోడ్డు, దానవాయిపేట పాత సిటీ హాస్పిటల్ సెంటర్, వై-జంక్షన్, క్వారీ సెంటర్, సీతంపేట వాటర్ ట్యాంక్‌ల సెంటర్ల నిత్యం రద్దీగా ఉంటాయి. ట్రాఫిక్ కాస్త అధికంగా ఉంటుంది. కాని దేవిచౌక్ సెంటర్‌కు మిగిలిన సెంటర్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో జంక్షన్ మొదలుకొని సైడ్ రోడ్డుకు వచ్చే వరకు కూడా రహదారులు విశాలంగా ఉంటాయి. కాని దేవిచౌక్‌లో రెండు రోడ్లు మాత్రమే విశాలంగా ఉండి మరో రెండు రోడ్లు ఇరుకుగా ఉంటాయి.దీని వల్ల నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులకు ఇది కత్తిమీద సామే.
రోడ్డుపైనే వాహనాలు
దేవిచౌక్ నుంచి లక్ష్మీవారపు పేట వెళ్లే దారి లో రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సంస్థల కు వచ్చిన వారి వాహనాలు, అందులో పనిచేస్తున్న వారి వాహనాలు రోడ్డుపై అడ్డదిడ్డంగా పార్క్ చేసి వదిలేస్తారు. దీని వల్ల ఆ రోడ్డులోకి వాహనం వెళ్లాలంటేనే ఇబ్బంది. ఈ రోడ్డులో వ్యాపార సంస్థలు ఉన్నాయి, కాని ఎవ్వరికి పా ర్కింగ్ స్థలం లేదు. భవనాల కింద షెల్లార్లు లేవు, పార్కింగ్ లేదు. దీంతో మొత్తం బైక్‌లు కార్లు అన్ని రోడ్డుపైన పెట్టేస్తారు. మెయిన్‌రోడ్డుకు దేవిచౌక్-లక్ష్మీవారపు పేట రోడ్డు అనుసంధానంగా ఉండడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో తరచు ఈ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరో పక్క దేవిచౌక్ నుంచి ఆజాద్‌చౌక్‌కు వెళ్లే దారిలో కూడా బైక్‌లు, కార్లు డివైడర్ ఉన్న స్థలంలో పార్కింగ్ చేసేయడం వల్ల ఈ రోడ్డు కూడా రద్దీగా మారుతుంది. ఇలా దేవిచౌక్ జంక్షన్ ట్రాఫిక్ వలయంలో కొట్టిమిట్టాడుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సెంటర్‌కు పార్కింగ్‌ను కేటాయించాలని, రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని, రహదారి విస్తరణ చేయాలని నగర ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే లేకుంటే పుష్కరాలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని అంటున్నారు.