Share News

టౌన్‌.. క్లీన్‌!

ABN , Publish Date - Jul 08 , 2025 | 12:54 AM

మండపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఇక పట్టణాలు, నగరాల్లో ఎక్కడా చెత్త వేసే కం పోస్టు యార్డులు కనిపించవు. ఆయా ప్రాంతాలను చెత్తరహితంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్వచ్ఛా ంధ్ర కార్పొరేషన్‌ ద్వారా రూ.225 కోట్ల వ్యయ ంతో రహదారులను శుభ్రం చేసే స్కేపింగ్‌ య

టౌన్‌.. క్లీన్‌!
మండపేటలో సంఘం కాలనీకివెళ్లే దారిలో ఉన్న కంపోస్టు యార్డు

ఇక పట్టణాల్లో కంపోస్టు యార్డులు కనుమరుగు

అక్కడి చెత్తంతా పవర్‌ ప్లాంట్‌లకు తరలింపు

విశాఖ లేదా గుంటూరు జిందాల్‌ చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసే ప్లాంట్‌కు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు

చెత్త తరలించే కంపాక్టర్‌ల కొనుగోలుకు రూ.225 కోట్ల కేటాయింపు

స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌, పురపాలక సంస్థలు నగదు చెల్లింపు

మండపేట, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఇక పట్టణాలు, నగరాల్లో ఎక్కడా చెత్త వేసే కం పోస్టు యార్డులు కనిపించవు. ఆయా ప్రాంతాలను చెత్తరహితంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్వచ్ఛా ంధ్ర కార్పొరేషన్‌ ద్వారా రూ.225 కోట్ల వ్యయ ంతో రహదారులను శుభ్రం చేసే స్కేపింగ్‌ య ంత్రాలు, చెత్తను తరలించే కంపాక్టర్‌లను కొను గోలు చేయాలని తాజాగా ఆదేశాలను జారీ చేసింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ సగం, పుర పాలక సంస్థలు సగం వం తున నగదును చెల్లించి యంత్రాలను కొను గో లు చేయాలని పురపాలక సంస్థలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చెత్త అక్కడికి..

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పురపాలక సంస్థలు రాజమహేంద్రవరం, కాకినాడతో నగరాలతోపాటు అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం, సామర్ల కోట, పెద్దాపురం, తుని, పిఠాపురం, ఏలేశ్వరం, కొవ్వురు, నిడదవోలు, మున్సిపాల్టీలలో ప్రతి రోజూ ఉత్పత్తి అయ్యే చెత్తను ఇక నుంచి ఏ రోజుకారోజు చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే కేంద్రాలు ఉన్న గుంటూరు లేదా విశాఖకు 40 టన్నుల సామర్థ్యం కలిగిన కంపాక్టర్‌ ద్వారా తరలించాల్సి ఉంటుంది. ఆ మేరకు అయ్యే ర వాణా చార్జీలను ఆయా మున్సిపాల్టీలు భరిం చాల్సి ఉంటుంది. దీంతో క్లీన్‌ పట్టణాలుగా ఆ యా మున్సిపల్‌ పట్టణాలు కనిపించనున్నా యి. ఇప్పటివరకు చెత్తను నిల్వ చేసే కంపోస్టు యార్డుల్లో ఉన్న చెత్తను ఎరువుగా మార్చి వేసి అక్కడ చెత్తను పూర్తిగా ఖాళీ చేసి పార్కులుగా మార్పుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చెత్త యార్డులుఖాళీ చేసేందుకు టెండర్లు...

దాంతో అధికారులు మున్సిపాల్టీల్లో ప్రస్తుతం ఉన్న కంపోస్టు యార్డుల్లో చెత్తను వేరు చేసి దానిని తరలించి ఖాళీ చేసేందుకు టెండర్లు కూడా పిలిచారు. మండపేట మున్సి పాల్టీలో రూ.29 లక్షలతో కంపోస్టు కేంద్రంలో ఉన్న చెత్తను తరలించేలా టెండరు పిలిచారు. మున్సి పాల్టీల్లో ఏరోజు వచ్చే చెత్తను ఆరోజు లారీల ద్వారా సేకరించి వాటిని వాటర్‌వర్క్సుకు తర లించి అదేరోజు మున్సిపాల్టీకి దగ్గరగా ఉండే జిందాల్‌ విద్యుదుత్పత్తి చేసే కేంద్రం గుంటూరు లేదా విశాఖకు తరలించాలని ప్ర భుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు ము న్సిపల్‌ అధికారులు కసరత్తు ప్రారంభించారు. పట్టణాల్లో నిత్యం ఉత్పత్తి అయ్యే చెత్త ఎంత మేర వస్తుంది, అందులో తడిచెత్త పొడిచెత్త ఎంతెంత? ప్లాస్టిక్‌ ఎంత అనేదానిపై కూడా ప్రభుత్వం లెక్కలు తీస్తోంది. ఈమేరకు మున్సి పల్‌ అధికారులు ఏమేరకు చెత్త ఉత్పత్తి అవు తుందనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Updated Date - Jul 08 , 2025 | 12:54 AM