Share News

పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయం

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:50 AM

జమ్మూ-కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమని రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాండ్రేగుల శంకర్‌, ధర్నాలకోట వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యకు నిరసనగా రాష్ట్ర ఉగ్రవాద ఫ్రంట్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాజేంద్రనగర్‌ పోలీస్‌ అమరవీరుల స్థూపం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.

పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయం
కోరుకొండలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న ఎమ్మెల్యే బత్తుల

  • ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు కాండ్రేగుల శంకర్‌

  • పలు చోట్ల కొవ్వొత్తుల ర్యాలీలు

రాజమహేంద్రవరం కల్చరల్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): జమ్మూ-కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత హేయమని రాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక ఫ్రంట్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాండ్రేగుల శంకర్‌, ధర్నాలకోట వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యకు నిరసనగా రాష్ట్ర ఉగ్రవాద ఫ్రంట్‌ ఆధ్వర్యంలో గురువారం స్థానిక రాజేంద్రనగర్‌ పోలీస్‌ అమరవీరుల స్థూపం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫ్రంట్‌ రాష్ట్ర ప్రతినిధులు,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కొవ్వొత్తులతో అమరులైన వారి ఆత్మశాంతికి మౌనం పాటించారు. కార్యక్రమంలో డీఎస్‌ రాజేశ్వరరావు, ధర్నాటకోట శ్రీనివాసరావు, రెల్లి సూరిబాబు, సోఫియా, పి.నాగబాబు, కె.సాయిరాం పాల్గొన్నారు. గురువారం ఉదయం వెంకటేశ్వరనగర్‌ వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు శాంతి ర్యాలీ నిర్వహించి, అమరులైన వారికి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ఉండవల్లి సత్యనారాయణ, భానుప్రసాద్‌, వాసు, సుబ్బారావు పాల్గొన్నారు. అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను తుదముట్టించాలని, అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆయన నాయకత్వంలో స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ జంక్షన్‌ వద్ద పార్టీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించి ఉగ్రవాదుల చేతిలో అశువులు బాసిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ అమాయకులైన పర్యాటకులపై దాడి చేయ డం చాలా బాధాకరమన్నారు. మాజీ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ పర్యాటకు లపై దాడి చేయడం అమానుషమని, దీనిని వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి పొట్టన పెట్టుకోవడం దారుణమన్నారు.రాజమహేం ద్రవరంలోనే కాక, రాష్ట్రంలోని అన్ని చోట్లా వైసీపీ శ్రేణులు కొవ్వొత్తుల ర్యా లీ నిర్వహించాయన్నారు. కార్యక్రమంలో ఆకుల వీర్రాజు, మేడపాటి షర్మిళారెడ్డి, నందెపు శ్రీను, తోట రామకృష్ణ, అడపా అనిల్‌, తలారి వెంకటేశ్వరరావు, అన్ని నియోజక వర్గాల నాయకులు పాల్గొన్నారు.

  • ఎమ్మెల్యే బత్తుల ఆధ్వర్యంలో..

కోరుకొండ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): జమ్ము కాశ్వీర్‌ ఉగ్రవాదుల దాడికి నిరసనగా కోరుకొండలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యం లో జనసైనికులు, వీర మహిళలు, కూటమి నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు విద్యార్థులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్‌ తీవ్రవాదులు నిశించాలని నినాదాలు చేశారు. పెహల్గామ్‌లో ఉగ్రదాడిలో మరణించిన వారిని ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - Apr 25 , 2025 | 12:50 AM