Share News

విషాదం మిగిల్చిన యాత్ర

ABN , Publish Date - Dec 13 , 2025 | 01:36 AM

చుట్టూ అడవి.. పెద్ద కొండలు.. చిమ్మ చీకటి.. దట్టంగా కమ్మేసిన పొగమంచు.. ఒకరికొకరు కని పించే పరిస్థితి లేదు..అంతా గాఢ నిద్రలో ఉన్నా రు.. బస్‌ చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌ రోడ్‌లో వేగంగా వెళుతోంది.. చలి ఎక్కువగా ఉండడంతో బస్‌ కిటికీల అద్దాలూ వేసే ఉన్నాయి.. సమయం తెల్లవారుజామున 4:30.. ఒక్కసారిగా పెద్ద కుదు పు.ఏం జరుగుతుందో తెలిసే లోపే.. పెద్ద ఎత్తున హాహాకారాలు..బస్సుమూడు ఫిల్టీలు వేసుకుంటూ లోయలో తల్లకిందులుగా పడిపోయింది.

విషాదం మిగిల్చిన యాత్ర

  • చింతూరు-మారేడుమిల్లి ఘాట్‌ రోడ్‌లో ట్రావెల్స్‌ బస్‌ బోల్తా

  • తెల్లారిన 9 మంది బతుకులు

  • 21 మంది క్షతగాత్రులు

  • నట్టడవిలో హాహాకారాలు

  • బస్‌లో మొత్తం 37మంది

  • ప్రమాదానికి డ్రైవరే కారణం?

(చింతూరు - ఆంధ్రజ్యోతి)

చుట్టూ అడవి.. పెద్ద కొండలు.. చిమ్మ చీకటి.. దట్టంగా కమ్మేసిన పొగమంచు.. ఒకరికొకరు కని పించే పరిస్థితి లేదు..అంతా గాఢ నిద్రలో ఉన్నా రు.. బస్‌ చింతూరు- మారేడుమిల్లి ఘాట్‌ రోడ్‌లో వేగంగా వెళుతోంది.. చలి ఎక్కువగా ఉండడంతో బస్‌ కిటికీల అద్దాలూ వేసే ఉన్నాయి.. సమయం తెల్లవారుజామున 4:30.. ఒక్కసారిగా పెద్ద కుదు పు.ఏం జరుగుతుందో తెలిసే లోపే.. పెద్ద ఎత్తున హాహాకారాలు..బస్సుమూడు ఫిల్టీలు వేసుకుంటూ లోయలో తల్లకిందులుగా పడిపోయింది.అప్పటి వరకూ నిద్రలో ఉండడంతో తేరుకునేలోపే ఒకరి పై ఒకరు కుప్పలా పడిపోయారు. బస్సులోంచి బయటకు వచ్చే పరిస్థితిలేదు. ఎవరైనా కాపాడక పోతారా అని చూస్తూనే ఉన్నారు. గంట పాటు అలాగే ఉండిపోయారు. సమయం 5:30 గంటల సమయంలో అటుగా వెళ్లే పలువురు వాహన దారులు ప్రమాదాన్ని గుర్తించారు.అక్కడికక్కడే వాహనాలు నిలిపివేశారు.కొందరు 108 వాహనా నికి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. సిగ్న ల్‌ లేకపోవడంతో వారి ప్రయత్నం ఫలించ లేదు. దీంతో వారిలో కొంతమంది వారి వాహనాలతో సిగ్నల్‌లోకి చేరుకొని పోలీసులు, 108 వాహనా నికి సమాచారం ఇచ్చారు.ఇంతలో మరి కొంతమంది బస్సు వెనకభాగాన్ని పగులగొట్టి బస్సులో చిక్కుకు పోయిన వారిని బయటకు తీశారు. ఇంతలో 108 వాహనాలు, పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే తెల్లారిపోగా..9 మంది బతుకులు తెల్లా రిపోయాయి. 21 మంది గాయాలపాలయ్యారు. అప్పటి వరకూ తమతో ఉన్న వారు ఇకలేరని.. తిరిగిరారని తెలియడంతో మృతుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. 108 వాహనాల్లో 9 మృతదేహాలు, క్షతగాత్రులను చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి బాధితుల రోదనలతో మిన్నంటింది. మృతుల్లో ఐదుగురు మహిళలు..నలుగురు పురు షులు ఉన్నారు. వీరిలో చిత్తూరు జిల్లా వాసులు ఐదుగురు,తిరుపతి,తెనాలికి చెందిన వారు ఒక్కొ క్కరు, బెంగళూ రుకు చెందిన ఇద్దరు ఉన్నారు. చింతూరు ఆసు పత్రిలో డిప్యూటీ డీఎంహెచ్‌వో డా.పుల్లయ్య,సూపరింటెండెంట్‌ డా.కోటిరెడ్డి సమ క్షంలో వైద్యులు 8 మృతదేహాలకు పోస్టుమార్టం చేశారు.చిత్తూరుకు చెందిన శైలాజారాణికి ఎవ రూ లేకపోవడంతో ఆమె మృతదేహానికి పోస్టు మార్టం చేయకుండా మార్చురీలో భద్రపర్చారు. పది అంబులెన్సలలో మృతదేహాలను, తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చిత్తూరుకు శుక్రవా రం రాత్రి తరలించారు.ఇక స్వల్పంగా గాయప డిన వారికి ప్రభుత్వం ఆర్టీసీకి చెందిన లగ్జరీ బస్‌ ఏర్పాటు చేసిందన్నారు.సంఘటనా స్థలాన్ని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేష్‌కు మార్‌, ఎస్పీ అమిత్‌ బర్ధర్‌,ఓఎస్‌డీ పంకజ్‌ కుమార్‌ మీనా,ఏఎస్సీ బొడ్డ హేమంత్‌ సందర్శిం చారు. చింతూరు ఆసుపత్రిలో చికిత్స పొందు తున్న క్షతగాత్రులను హోంమంత్రి వంగలపూడి అనిత,రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించి వైద్యులతో మాట్లాడి వారి పరిస్థితిని తెలుసుకున్నారు. ఘటనపై తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు.మృతు లకు రూ.5 లక్షలు..క్షతగా త్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.

చిత్తూరులో బయలుదేరారు..

చింతూరులో ప్రాణాలొదిలారు!

చిత్తూరులో బయలుదేరిన యాత్రికులు చింతూ రులో ప్రాణాలొదిలారు. చిత్తూరుకు చెందిన ట్రావెలర్‌ ఆర్గనైజర్‌ పీఎం వజ్రమణి వారం కిందట శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్‌ బస్సును అద్దెకు తీసుకున్నాడు. తదుపరి చిత్తూరు, బెంగుళూరు, తిరుపతి, కుప్పంలకు చెందిన 32మందిని పలు యాత్రా ప్రదేశాలకు తీసుకెళ్లేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతర్వేది, సామర్లకోట, ద్రాక్షారామ, అరసవిల్లి తదితర ప్రదేశాలను సందర్శించుకుంటూ గురువారం పాడేరు జిల్లా అరకు చేరుకుని పలు ప్రదేశాలను సందర్శిం చా రు. యాత్రికులు రాత్రి 8 గంటల సమయంలో భోజనం ముగించుకొని బయలుదేరారు. బస్సు జగ్గంపేట మీదుగా భద్రాచలం చేరుకోవాల్సి ఉంది. రాత్రి కావడంతో యాత్రికు లందరూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. బస్సులో ఇరువురు డ్రైవర్లు ఉండగా వారిలో సీనియర్‌ డ్రైవర్‌ మధు జూనియర్‌ డ్రైవర్‌కు డ్రైవింగ్‌ అప్పగించి నిద్రకు ఉపక్రమించాడు. మారేడుమిల్లి దాటి బస్‌ ఘాట్‌ రోడ్‌ చేరుకుంది. పోలీసులు ఇచ్చిన సమాచా రం మేరకు డ్రైవర్‌ తప్పిదమే ప్రమాదానికి కారణ మని చింతూరు వచ్చిన రాష్ట్ర మంత్రులు సంధ్యా రాణి తదితరులు పేర్కొనడం జరిగింది.

అసలేం జరిగింది..

ప్రమాదానికి ఏం కారణమై ఉంటుందనేది అర్ధం కావడంలేదు.. ప్రత్యక్ష సాక్షులైన యాత్రికులు భిన్నవాదనలు వినిపిస్తున్నారు. ఘాట్‌లో కమ్ముకున్న పొగమంచుకు ఎదుట ఉన్న రోడ్డు కనిపించకుండా పోయింది. దీనికి తోడు డ్రైవరు ఘాట్‌ రోడ్డుకు కొత్త కావడంతో పరిస్థితి అర్థం కాలేదంటున్నారు. ఘాట్‌ డౌన్‌ ప్రయాణం కాబట్టి డ్రైవర్‌ బస్సు గేర్‌ను న్యూట్రల్‌ చేశాడని.. దీంతో బస్సు వేగం పెరిగి అదుపు తప్పి లోయలో పడిందని కొందరు యాత్రికులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కాదు కాదు బ్రేక్‌ ఫెయిలైందని మరికొందరు యాత్రికులు చెబుతున్నారు.

రాత్రి వేళ ఘాట్‌ రోడ్‌ బంద్‌

మారేడుమిల్లి, డిసెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఘాట్‌ రోడ్లుపై రాత్రిపూట భారీ వాహనాల ప్రయా ణాలు అధికారులు నిషేధించినట్టు జిల్లా ఎస్పీ అమిత బర్దర్‌ తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు జిల్లాలోని అన్ని ఘాట్‌రోడ్లపై వాహనాల ప్రయాణంపై ఆంక్షలు విధించినట్టు తెలిపారు. ప్రస్తుత పొగమంచు పరిస్థితులు మెరుగుపడే వరకు నిషేధం అమలులో ఉంటుందన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 01:36 AM