Share News

నీటిలో తేలిపోదాం!

ABN , Publish Date - Jun 23 , 2025 | 12:29 AM

ఉమ్మడి తూర్పు గోదావరి జ్చిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిం చడానికి అడు గులు పడుతున్నాయి.

నీటిలో తేలిపోదాం!
లొల్ల లాకులు

సాహస జలక్రీడలకు ప్రోత్సాహం

ఉమ్మడి జిల్లాలో 13 ప్రదేశాలు ఎంపిక

టెండర్లు ఆహ్వానించిన పర్యాటకశాఖ

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

హాయ్‌...కోనసీమ జిల్లాలోని లొల్లలాకుల గురించి వినే ఉంటారు కదా..ఇక్కడ అల్లు అర్జున్‌ గంగోత్రి సినిమా నుంచి వెంకటేష్‌ వెంకిమామ వరకు తీయని షూటింగ్‌లు లేవు..ఇక్కడ అందాలు వర్ణనాతీతం.. వంతెన పైనుంచి ఈ అందాలు వీక్షించడమే.. బోటుషికారుకు ఛాన్స్‌ లేదు. హాయిగా బోటు షికారు.. వాటర్‌ స్పోర్ట్స్‌ ఉంటే ఎంత బాగుంటుంది..

ఆత్రేయపురం వద్ద గోదావరిలో ఏటా సంక్రాంతికి రాష్ట్రస్థాయిలో పడవల పోటీలు జరుగు తాయి.. ఇక్కడ కాలువ అందాలు కట్టిపడేస్తాయి.. అలాంటిది హాయిగా ఇందులో బోటు షికారు.. స్పీడ్‌ బోట్‌లో రైడ్‌ చేస్తే ఆ మజాయే వేరు..

గోదావరి ఒడ్డున గోష్పాద రేవు, దిండి, సర స్వతి,పద్మావతి ఘాట్‌ల వద్ద ఎంచక్కా రాత్రివేళల్లో.. వెండివెన్నెల్లో హౌస్‌బోట్‌లో పార్టీ చేసుకుంటే ఆ థ్రిల్లే వేరు..కానీ ఆ ఛాన్సే లేదు..

తాండవ,పంపా,కాకినాడ పండూరు చెరువు, ఉండూరు గోదావరి కెనాల్‌లో వాటర్‌ బాల్‌లో నిల్చుని సాహసం చేయడం..సొంతంగా బోటు నడపడం చేస్తే ఆ కిక్కేవేరు.. వీటన్నింటిని పర్యాటకులకు సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో పర్యాటక అందాలున్నాయి. వీటిని అభివృద్ధి చేస్తే జిల్లా పర్యాటక రంగంలో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశాలు ఉన్నాయి. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఇదేదీ పట్టించు కోలేదు. కొత్తగా పర్యాటక రంగ అభివృద్ధి మాట దేవుడెరుగు ఉన్న పర్యాటక సదుపాయాలను గాలి కొదిలేసింది. ప్రభుత్వం మారింది.. మళ్లీ ఉమ్మడి తూర్పు గోదావరి జ్చిల్లాలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిం చడానికి అడు గులు పడుతున్నాయి. గోదావరి, గోదావరి కాలువలు, రిజర్వాయర్లలో జల క్రీడలను అడ్వంచర్‌ టూరిజం పేరి ట ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. బోటు షికార్లతో పాటు పార్టీ చేసుకునేలా హౌస్‌బోట్లు, వాటర్‌ బాల్స్‌, స్పీడ్‌ బోట్లు, వాటర్‌ బైక్‌లు ఇలా అనేకరకాల సాహస జల క్రీడలను ప్రైవేటు సంస్థల ద్వారా ప్రారంభించేందుకు వీలుగా టెండర్లు పిలిచింది. పర్యాటక శాఖ లాభాపేక్ష లేకుండా సాహస జల క్రీడ లను ప్రైవేటు కంపెనీలు ప్రారంభించేలా వార్షిక ఫీజు రూ.2 లక్షల లోపు మాత్రమే నిర్ణయించి వారికి అను మతి ఇవ్వబోతోంది.పనితీరు బాగుంటే లైసెన్సులు పదేళ్ల వరకు పొడిగించబోతోంది. టెండర్‌ దక్కిన కంపెనీలు ఎంపిక చేసిన ప్రదేశంలో ఎంత మొత్తమైనా పెట్టుబడి పెట్టి సాహస జలక్రీడలను నిర్వహించొచ్చు.

పంపాలో జలక్రీడలు..

ఉమ్మడి జిల్లాలో 13 ప్రదేశాల్లో సాహస జల క్రీడ ల కు అనుమతులను పర్యాటక శాఖ ఇవ్వబోతోంది. ఇప్ప టికే వాటిని గుర్తించి ప్రైవేటు సంస్థలు రకరకాల జల క్రీడలు మొదలుపెట్టేలా ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా కాకినాడ జిల్లాలో అన్నవరం ఆలయం దిగు వన భారీ పంపా రిజర్వాయరు ఉంది. చుట్టూ కొండల నడుమ వయ్యారాలు పోతూ రిజర్వాయరు అందాలు కట్టిపడేస్తాయి. ఇక్కడ బోటు షికారు, వాటర్‌ బాల్స్‌లో ఆటలు, వాటర్‌ బైక్‌లను పర్యాటకులకు అందు బా టులోకి తీసుకురాబోతోంది. తాండవ రిజర్వాయరు లోను ఇటువంటి క్రీడలు ప్రారంభించడానికి పర్యాటక శాఖ అనుమతులిచ్చింది. కాకినాడలో వివేకానంద పార్కులో బోటింగ్‌,వాటర్‌ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తేనున్నారు. కాకినాడ మాధవపురం, పండూరి చెరువు గట్టు, ఉం డూరు గోదావరి నీటి కాలువ చాలా అందంగా ఉం టాయి. ఇక్కడ కూడా బోటింగ్‌కు అనుమతిచ్చింది. కోనసీమ జిల్లాలో దిండి వద్ద గోదావరి తీరంలో కొత్తగా హౌస్‌ బోటుకు అనుమతిచ్చింది. ఇక్కడ ఇప్పటికే రెండు ఉండగా డిమాండ్‌ అధికంగా ఉంది. కొత్తగా బోటుతో పాటు వాటర్‌ స్పోర్ట్స్‌ నిర్వహించనున్నారు. ఆత్రేయపురం నుంచి ధవళేశ్వరం వరకు విశాలమైన గోదావరి కాలువ ఉంది. ఇక్కడ ఏటా సంక్రాంతికి రాష్ట్రస్థాయిలో పడ వల పోటీలు జరుగుతాయి. ఇకపై ఇక్కడ బోటు షికారు, వాటర్‌ బాల్స్‌తోపాటు పలురకాల సాహస జల క్రీడలను మొదలుపెట్టనున్నారు. లొల్ల లాకులైతే గోదావరి అందా నికి పెట్టింది పేరు. ఇక్కడ కూడా కాలువకు అటు ఇటు జిప్‌లైనర్‌, తాళ్లతో కూడిన వంతెన, బోటింగ్‌ అందు బాటులోకి తేనున్నారు. చించినాడ వద్ద ఎలమంచిలిలంక వద్ద కూడా సాహస జల క్రీడలకు ప్రభుత్వం అనుమ తిచ్చింది. కొవ్వూరు గోష్పాద రేవు వద్ద కొత్తగా పలు వాటర్‌ స్పోర్ట్స్‌ మొదలుపెట్టనున్నారు. బోటింగ్‌, వాటర్‌ బాల్స్‌తో పాటు పార్టీ బోటు అందుబాటులోకి తేను న్నారు. ఆకర్షణీయ పార్టీ బోటును అందుబాటులోకి తే నున్నారు.రాజమహేంద్రవరం సరస్వతి ఘాట్‌, పద్మావతి ఘాట్లలోను హౌస్‌బోట్‌లు మొదలుపెట్టను న్నారు. ఇం దులో రాత్రివేళ బస చేయవచ్చు. టెండర్లు దక్కించు కున్న కంపెనీలు ఈ 13 ప్రదేశాల్లో సాహస జలక్రీడ లను ఆరు నెలల్లోగా అందుబాటులోకి తేవాల్సి ఉంది.

Updated Date - Jun 23 , 2025 | 12:29 AM