నష్టమొంథా!
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:21 AM
మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టం అంతా ఇం తా కాదు.. తుఫాన్ ప్రభావం పెద్దగా లేకపో యినా.. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు జరిగిన నష్టమే ఎక్కువ.
87 కి.మీ హైవే,ఆర్‌అండ్‌బీ
137 కి.మీ పీఆర్ రోడ్లు
తుఫాన్ మిగిల్చిన నష్టం
రోడ్డెక్కాలంటేనే భయం భయం
వాహనదారులకు నరకం
అంచనాల్లో అధికారులు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టం అంతా ఇం తా కాదు.. తుఫాన్ ప్రభావం పెద్దగా లేకపో యినా.. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు జరిగిన నష్టమే ఎక్కువ. ఆర్‌అండ్‌బీ, పంచా యతీ రాజ్ శాఖల రోడ్లను గుల్ల చేసేసింది.. పెద్ద పెద్ద గుంతలు మిగిల్చింది. జిల్లాలో 87.99 కిలోమీటర్ల మేర ఉన్న 48 ఆర్‌అండ్‌బీ స్టేట్ హైవే రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే తుఫాన్ కారణంగా నాలుగురోజుల పాటు భారీగా వానలు కురిశాయి. దీంతో చిన్న చిన్నగా ఉన్న గుంతలు పెద్దవిగా మారిపోయాయి. జిల్లాలోని పలు ప్రధా న రహదారులు గోతులతో నిండిపోయాయి. జాతీ య రహదారి మొత్తం గోతులమయంగా మారి పోయింది. దివాన్‌చెరువు వద్ద జాతీయ రహ దారిపై ఇటీవలే కొత్త రోడ్డు వేశారు.ఆ రోడ్డు కూడా గత వర్షా లకు కొట్టుకుపోయింది. దీంతో ఎటు చూసినా గోతులే దర్శనమిస్తున్నాయి. ఇక పంచా యతీ రాజ్‌కు చెందిన 70 రోడ్లు 137.15 కిలో మీటర్ల మేర గుంతలమయమయ్యాయి. రూ.86.27 కోట్ల నష్టం వాటిల్లింది. తాత్కాలిక మరమ్మతులకు రూ.2.38 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. శాశ్వత మరమ్మతులు చేపడితే 86.27 కోట్లు ఖర్చవుతుందని అధికారుల అంచనా. ఈ మేరకు మొంథా తుఫాన్ నష్టాలపై ప్రత్యేక బృం దాలు నివేదికలు సిద్ధం చేస్తున్నాయి. శనివారం ఆర్‌అండ్‌బీ, పీఆర్ రోడ్లపై నివేదికలు ఇచ్చాయి.
రాజమహేంద్రవరం డివిజన్‌లో ఇలా..
రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలోని రాజానగరం నుంచి పెద్దపర్తిరేవు రోడ్డు,సోమేశ్వరం నుంచి రాజానగరం రోడ్డు, రాజ మహేంద్రవరం పుణ్యక్షేత్రం మీదుగా కేశవరం రోడ్డు, కడియపులంక -వెదురుమూడి రోడ్డు, మండపేట-దుళ్ల రోడ్డు, కడియం నుంచి రాజమహేంద్రవరం రోడ్డు, బుచ్చింపేట - గాదరాడరోడ్డు,రాజమహేంద్రవరం నుంచి మల్లవరం మీదు గా గోకవరం రోడ్డు, దివాన్‌చెరువు- పుణ్యక్షేత్రం రోడ్డు, జీఎన్ టీ - జెడ్.మేడపాడు రోడ్డు, కోరుకొండ - నాగంపల్లి రోడ్డు విజయవాడ- విశాఖపట్నం రోడ్డు, పందలపాక - అరికిరేవుల రోడ్డు, శ్రీరంగపట్నం- నలగొండ రోడ్డు, రాజ మండ్రి నుంచి కనుపూరు మీదుగా గోవకరం రోడ్డు, వెం కటనగరం నుంచి ఎన్‌హెచ్ 5 రోడ్డు, ఎన్‌హెచ్ 5 నుంచి పోలీసు క్వార్టర్స్ రోడ్డు, బైపాస్ రోడ్డు దెబ్బతిన్నాయి.
కొవ్వూరు డివిజన్‌లో ఇలా..
కొవ్వూరు డివిజన్ పరిధిలో మార్టేరు -పక్కి లంక రోడ్డు, విజ్జేశ్వరం- నిడదవోలు రోడ్డు, నిడదవోలు- అశ్వారావుపేట రోడ్డు, యర్నగూడెం- పొంగుటూరు రోడ్డు, తాడేపల్లి - అనంతపల్లి రోడ్డు, చేబ్రోలు-దేవరపల్లి రోడ్డు, మద్దూరు బ్రిడ్జి నుంచి చంద్ర వరం రోడ్డు, బల్లిపాడు నుంచి అన్న దేవరపేట రోడ్డు, గజ్జరం నుంచి హుకుంపేట రోడ్డు, ఎన్‌హెచ్ రోడ్డు నుంచి ఈజీకే రోడ్డు, నల్లజర్ల నుంచి లక్ష్మీనగరం రోడ్డు దెబ్బతిన్నాయి.