అంతటా అలర్ట్!
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:46 AM
జిల్లాపై తుఫాన్ ప్రభావం పడింది. తుఫాన్ తీరం దాటకముందే జిల్లావ్యా ప్తంగా పలు ప్రాంతాల్లో పంట తీవ్రంగా నష్టపోయింది. ఇళ్లు దెబ్బతిన్నాయి.
నష్టమొచ్చింది..కష్టమొచ్చింది!
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
జిల్లాపై తుఫాన్ ప్రభావం పడింది. తుఫాన్ తీరం దాటకముందే జిల్లావ్యా ప్తంగా పలు ప్రాంతాల్లో పంట తీవ్రంగా నష్టపోయింది. ఇళ్లు దెబ్బతిన్నాయి. జిల్లా లో ముంపు ప్రాంతా లుగా 9 గ్రామాలను గుర్తించారు. ఆయా గ్రా మాల్లో కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తు న్నారు. 67 కచ్చా ఇళ్లు శిథిలావస్థలో ఉన్నట్టు గుర్తించారు.జిల్లా వ్యాప్తంగా 214 పునరావాస కేం ద్రాలు ఏర్పాటు చేసి 264 కుటుంబాలకు చెందిన 912 మందిని తరలిం చారు. ఆయా కేంద్రాల వద్ద తహశీల్దార్లు,ఎంపీడీవోలు పర్య వేక్షిస్తున్నారు. జిల్లా లో ఇప్పటికే 14 ఇళ్లు దెబ్బ తిన్నాయి. 217 చెట్లు కూలిపోగా 21 చెట్లను వెంటనే తొలగించారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 22 వేల ఇసుక బస్తాలు సిద్ధం చేశారు.అనపర్తిలో ఒక గ్రామం నుంచి పశువు లను తరలించడానికి గుర్తిం చారు.జిల్లా వ్యాప్తంగా 139 గ్రామాల్లో 6170.1 హెక్టార్ల వరి పంట నేలకొరిగిందని, 80.2 హెక్టార్ల పంట నీట మునిగి పోయిందని జిల్లా వ్యవసాయాధికారి ఎస్.మాధవరావు తెలిపారు. అపరాల పంటలు మొత్తం 799 హెక్టార్లలో మునిగిపోయినట్టు చెప్పారు.
రాత్రి 7 గంటలకే బంద్ చేయండి
రాజమహేంద్రవరం, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ తీవ్రత నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి అత్యవసరమైతే తప్ప రోడ్లపై తిరగడాన్ని పోలీసులు నిషేధించారు. దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.7 గంటల తర్వాత పోలీసులు పెట్రోలింగ్ చేసి రోడ్లపై జనం సంచరించ కుండా చర్యలు తీసుకున్నారు. వర్షాలు, గాలులు నెమ్మదించే వరకూ ఈ పరిస్థితిని కొనసాగించనున్నారు. గోదావరి రేవుల వద్ద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేశారు. విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు 30 మంది ఎస్డీఆర్‌ఎఫ్ బృందం రాజమహేంద్ర వరంలో సిద్ధంగా ఉంది. ఈదురు గాలుల వల్ల పలు చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హాస్టళ్లల్లోని విద్యార్థులను ఇళ్లకు పంపించేశారు.జిల్లా కేంద్రంలో సుమా రు 200 వరకూ భారీ హోర్డింగ్‌లు తొలగించారు. డ్రైన్లలో నీరు సాఫీగా ప్రవహించడానికి వీలుగా సిల్టు తొలగించారు.
ఆర్టీసీకి బ్రేకులు
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుఫాను నేపథ్యంలో ఆర్టీసీ సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి వర్షం, ఈదురుగాలులు పెరగడంతో రాత్రి ఏడు గంటల నుంచి ఆర్టీసీ అన్ని సర్వీసులను రద్దు చేసింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ బస్సులు తిరగడంలేదనే సమాచారంతో కంగారు పడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ప్రధానమైన విజయవాడ, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్ వంటి దూరప్రాంత సర్వీసులు నిలిచిపోయాయి. మంగళవారం రాత్రి మొంథా తుఫాన్ అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని తాకడంతో ఈ నెల 29వ తేదీ బుధవారం మధ్యాహ్నం వరకూ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కే పరిస్థితి కనిపించడంలేదు.50 శాతం బస్సులు నడుపుతామని జిల్లా ఆర్టీసీ అధికారులు చెబుతున్నా దానిపైనా పూర్తి క్లారిటీ రావడంలేదు. ముందస్తు సమాచారం లేకుండా బస్సుల సర్వీసులను రద్దు చేయడంపై ప్రయాణీకుల్లో అసంతృప్తి వ్యక్తమైంది.
విపత్తును సమర్థంగా ఎదుర్కొందాం
అధికారులతో సమీక్షలో మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం, అక్టోబరు 28 (ఆంధ్ర జ్యోతి) : తుఫాన్ తీవ్రత దృష్ట్యా రానున్న మూడు రోజుల పాటు అధికారులు 24 గంటలూ విధుల్లోనే ఉండాలని మంత్రి కందుల దుర్గేష్ ఆదేశిం చారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా అధికారులతో సమీక్షిం చారు. విపత్తును ఎదుర్కొనేందుకు యువతకు శిక్షణ ఇచ్చి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకుంటూ ముందుకె ళ్లాలన్నారు. జిల్లా ప్రత్యేకాధికారి కె.కన్నబాబు మాట్లాడుతూ ఎర్ర కాలువ, కొవ్వాడ, బురద కాలువల్లో నీటి ప్రవాహం పెరిగే పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అవసర మైతే రిజర్వాయర్ల దిగువకు నీటిని వదిలేయాలన్నారు. రహదా రులపై గండ్లు పడే అవకాశం ఉన్న ప్రాంతాలు గుర్తించి తక్షణం ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని అప్ర మత్తం చేశామన్నారు. అవసరమైన చోట్ల పునరావాస కేం ద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ డి.నరసింహకిశోర్ మాట్లాడుతూ అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో పహరా కట్టుదిట్టం చేశామని తెలిపారు.కొవ్వూరు ప్రాంతంలో కొత్తచెరువు వద్ద పదేళ్ల కిందట గండిపడిన ప్రాంతంలో ముందస్తు చర్యగా 1000 ఇసుక బస్తాలతో రక్షణ చర్యలు చేపట్టామని కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత తెలిపారు. పునరావాస కేంద్రాల్లో వేడి అన్నం పెట్టే ఏర్పాటు చేసినట్టు రాజమహేంద్రవరం ఆర్డీవో ఆర్.కృష్ణనాయక్ చెప్పారు. మైనర్ ఇరిగేషన్ అధికారులు ఆయా ప్రాంతాలలో పర్య టించి, చెరువులకు గండ్లు పడే పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.సమావేశంలో జేసీ మేఘాస్వరూప్, డీఆర్‌వో టి.సీతారామ మూర్తి, కమిషనర్ రాహుల్ మీనా, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.