నేడే పాలిసెట్
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:26 AM
ఈ నెల 30న జరుగనున్న ఆంధ్రప్రదేశ్ పాలిసెట్- 2025 ప్రవేశ పరీక్షను దృష్టిలో ఉంచుకుని గోదా వరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాలను సాం కేతిక విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జె.సత్యనారాయణమూర్తి మంగళవారం పరిశీ లించారు.
పలు పరీక్ష కేంద్రాలను పరిశీలించిన ఆర్‌జేడీ సత్యనారాయణమూర్తి
రాజానగరం, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ఈ నెల 30న జరుగనున్న ఆంధ్రప్రదేశ్ పాలిసెట్- 2025 ప్రవేశ పరీక్షను దృష్టిలో ఉంచుకుని గోదా వరి గ్లోబల్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాలను సాం కేతిక విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జె.సత్యనారాయణమూర్తి మంగళవారం పరిశీ లించారు. గైట్ పాలిటెక్నిక్ కళాశాల, ఆర్‌కే బ్లాక్ లను సందర్శించిన ఆయన, పరీక్షా ఏర్పాట్లను సమీక్షించి సంతృప్తి వ్యక్తంచేశారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆయన సూచించారు. విద్యార్థుల సౌకర్యార్ధం తాగునీటి సరఫరా వంటి మరికొన్ని ముఖ్యమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా గైట్ పాలిటెక్నిక్ కళాశా ల ప్రిన్సిపాల్ పీజీ రామానుజం మా ట్లాడుతూ పాలిసెట్-2025 ప్రవేశ పరీక్ష కోసం జీజీయూ ప్రాంగణంలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో మొత్తం 1791 మం ది విద్యార్థులు పరీక్ష రాయనున్నారన్నారు. విద్యా ర్థులు వేర్వేరు వాహనాలలో గైట్ కళాశాల ప్ర వేశ ద్వారం వద్దకు చేరుకున్న తర్వాత వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకునేందుకు కళాశాల యాజమాన్యం ప్రత్యేక రవాణా సదు పాయాన్ని మెయిన్ గేట్ వద్ద నుంచి అందు బాటులోకి తీసుకొచ్చారు. అలాగే తూర్పుగోన గూడెంలోని ఐఎస్‌టీఎస్ మహిళా ఇంజనీ రింగ్ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 800 మంది పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. కార్యక్రమంలో బొమ్మూరు జీఎంఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ నాగేశ్వర రావు, వైస్ ప్రిన్సిపాల్స్ టి.రామారావు, కె.కిరణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
బీవీసీలో రెండు పరీక్షా కేంద్రాలు
దివాన్‌చెరువు, ఏప్రిల్29 (ఆంధ్రజ్యోతి): ఏపీ పాలిసెట్ పరీక్షకు రాజానగరం మండలం పాలచర్లలోని బీవీసీ ఇంజనీరింగ్ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారని పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు కె.నగేష్, కె.వీరబ్బాయి తెలిపారు. ఈ రెండు కేంద్రాలలోనూ కలిపి 800 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని చెప్పారు. బుధవారం ఉదయం గం 11 నుంచి 1గంట వరకూ పరీక్ష జరుగుతుందని చెప్పారు. కళాశాలలో ఏర్పాటు చేసిన పాలిసెట్ పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఏర్పాట్లును ఆర్ జేడీ జె.సత్యనారాయణమూర్తి, పరిశీలకులు బి.సతీష్, మేరీ మంగళవారం పరిశీలించారు.