జయహో.. భారత్
ABN , Publish Date - May 19 , 2025 | 12:42 AM
దేశభక్తి ఉప్పొంగింది.. భారత్ మాతాకీ జై అంటూ జనం వీధుల్లోకి వచ్చారు.. మువ్వన్నెల జెండా పట్టుకుని వీధివీధినా మేలుకొలిపారు.. రండి మీరూ చేరండి అంటూ పిలవకనే పిలిచారు..
నిడదవోలు, మే 18 (ఆంధ్రజ్యోతి) : దేశభక్తి ఉప్పొంగింది.. భారత్ మాతాకీ జై అంటూ జనం వీధుల్లోకి వచ్చారు.. మువ్వన్నెల జెండా పట్టుకుని వీధివీధినా మేలుకొలిపారు.. రండి మీరూ చేరండి అంటూ పిలవకనే పిలిచారు.. దీంతో నిడదవోలులో తిరంగా యాత్ర ఆదివారం ఘనంగా సాగింది.నిడదవోలు గాంధీబొమ్మ సెంటరు నుంచి వినాయకుడి గుడి మీదుగా ఐ లవ్ నిడదవోలు పార్కు వరకు తిరంగా ర్యాలీ నిర్వ హించారు. దీనిలో భాగంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ భారత జాతి వైపు ఎవరైనా కన్నెత్తి చూస్తే వారికి గుణపాఠం చెప్పేందుకు సైనికుల నుంచి మొదలుకొని రైతుల వరకు జాతి యావత్తూ ఒక్కటై వారికి గుణపాఠం చెబుతుందనడానికి నిదర్శనమే ఈ తిరంగా యాత్ర అన్నారు. జనం స్వచ్ఛందంగా రావడం అభినందనీయమన్నారు. ర్యాలీ మన ఐక్యతకు నిదర్శనమన్నారు.స్కిల్ డవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగు పల్లి శేషారావు మాట్లాడుతూ మనమంతా ఒక్కటే అని.. ఏ సమస్య వచ్చినా ఒక్కటై ఎదుర్కొంటామనడానికి నిదర్శనం ఈ యాత్ర అన్నారు.ఈ కార్యక్ర మంలో మునిసిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, టీడీపీ, జనసేన, బీజేపీ, పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది వివిధ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.